ఉత్తరాయణం

తెలుగు మాట్లాడడం మన సంస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు వెలుగు జిలుగులు విరజిమ్మిన తెలుగు భాషకు పరభాషా వ్యామోహమనే గ్రహణం పట్టి మబ్బులు కమ్మేస్తున్నాయి. దాంతో మన తెలుగు భాషకు సంబంధించిన అలవాట్లు, అభిరుచులు, సంస్కృతీ సంప్రదాయాలు ఒక్కొక్కటి మరుగునపడుతున్నాయి. కొందరు తెలుగు మాట్లాడితేనే తమ అంతస్తుకి, గొప్పతనానికి భంగమనుకుంటున్నారు. వాళ్ల పిల్లలకు ‘అ’ అంటే అంకుల్ అని, ‘ఆ’ అంటే ఆంటీ అని నేర్పిస్తున్నారు. వీళ్లు ఈ పద్ధతి మార్చుకుని ‘అ’ అంటే అమ్మ అని, ‘ఆ’ అంటే ఆవు అని నేర్పించాలి. అప్పుడే మన తెలుగు భాషలోని మాధుర్యం, నుడికారపు సొంపు తొణికిసలాడుతుంది. మనది తెలుగు భాష...మనం తెలుగువాళ్లం..మనది తెలుగు జాతి...మన భాషను చెక్కుచెదరకుండా సుభిక్షంగా వుండేట్టు చూసుకునే బాధ్యత మనదే. ఇదీ మన తెలుగు భాషా సౌరభం.. ఇదీ మన తెలుగు భాషా వైభవం..

-కాయల నాగేంద్ర, హైదరాబాద్
అమ్మభాషను బతికిద్దాం
తెలుగువాడిగా పుట్టి, తెలుగు భాషను వాడకపోవడం తీరని అపచారం. ‘తెలుగు నాకు రాదు..’ అని చెప్పడం గర్వకారణం కానే కాదు. అది మాతృభాషకు, మన సంస్కృతికి అవమానం, తీవ్ర బాధాకరం. అమ్మకి ఆభరణాలు అవసరం లేదు, ఆదరిస్తే చాలు. అమ్మభాషకు కోటలు కట్టనక్కర్లేదు. మనసారా మాట్లాడితే చాలు. తెలుగు నుడికారంపై మమకారం పెంచుకుందాం. ‘మమ’ అనిపించే అధికార వ్యవహారాలతో కాదు, మనది అనుకునే వ్యావహారిక భాషను ఎల్లవేళలా మన చేతలతో, చేతులతో సాకుదాం. పిల్లలకు నేర్పిద్దాం. భాష కలకాలం నిలిచేది చట్టాలతోనో, ఆదేశాలతోనో కానే కాదు- జనాదరణతోనే. మాతృభాషా దినోత్సవాలు కాదు.. దినం దినం ఉత్సాహంగా మాట్లాడడమే తెలుగుని బతికించే ఏకైక మార్గం.
-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
హడలెత్తిస్తున్న ధరలు
మళ్లీ కూరగాయల ధరలు అటకెక్కి కూర్చున్నాయి. టమాటాలు పది రూపాయలకు మూడు కేజీల చొప్పున అమ్మిన వ్యాపారులు ఇప్పుడు అరవై రూపాయలకు పైనే అమ్ముతున్నారు. ఇతర కూరగాయల ధరలు కూడా కేజీకి నలభై నుంచి అరవై రూపాయల దాకా పెరిగాయి. వర్షాలు పడి పంటలు ఎక్కువగా పండుతున్న కాలంలో కూడా కూరలు ఇంత ఖరీదా? ఇది ధరల కృత్రిమ పెంపా? లేక దిగుబడి తక్కువైందా? మధ్య, దిగువ తరగతి ప్రజల జీవన ప్రమాణాలు ఇలా అదుపులేని ధరల వల్ల కుదించుకుపోతున్నాయి. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ధరలను నియంత్రిస్తే నాలుగు వేళ్లు నోటిలోకిపోతాయి. లేకపోతే ఒంటిపూట భోజనమే గతి.
- ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్