ఉత్తరాయణం

బడుల్లో పాత పద్ధతులు ఏవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దే ఒకప్పటి పద్ధతులు ఇపుడు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కనుమరుగయ్యాయి. గతంలో నిర్ణీత టైమ్ టేబుల్‌ను అన్ని బడుల్లోనూ అమలు చేసేవారు. విద్యార్థుల చేత ఉదయానే్న ‘డ్రిల్’ చేయించడం గతంలో కనిపించేది. ఆ విధానానికి ఇపుడు పూర్తిగా స్వస్తి పలికారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ‘డ్రిల్’ ఎంతగానో దోహదపడేది. వారంలో ఒకరోజు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు గతంలో నిర్వహించేవారు. జాతీయ పండుగలు, జాతి నేతల పుట్టినరోజుల సందర్భంగా ఈ తరహా పోటీలను జరిపేవారు. దీనివల్ల మన నేతల గురించి, దేశ చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కలిగేది. అలాగే, ప్రతిరోజూ సాయంత్రం తరగతులు ముగిశాక విద్యార్థుల చేత విధిగా గంట సేపు వివిధ క్రీడలను నిర్వహించేవారు. ఇపుడు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు కానె్వంట్లలో, కార్పొరేట్ స్కూళ్లలో ఆటల ప్రసక్తే కనిపించడం లేదు. చాలా పాఠశాలల్లో క్రీడా పరికరాలు గానీ, మైదానాలు గానీ లేవు. ఎంతసేపూ మార్కులు, ర్యాంకుల పేరుతో విద్యార్థులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒత్తిడి పెంచుతున్నారు. పిల్లల మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి అవకాశాలు లేని పరిస్థితులను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చూస్తున్నాము. కొన్ని ప్రభుత్వ బడుల్లో మాత్రం క్రీడలకు కొంత ప్రోత్సాహం కనిపిస్తున్నా, కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలను ఖాతరు చేయని ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థుల మానసిక స్థాయి పెరిగేందుకు యోగ, ధ్యానం వంటివి ప్రోత్సహించడం లేదు. ఈ విషయంలో ఇకనైనా ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు చొరవ చూపాలి. ఇక పాఠశాలల్లో సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ వంటివి విద్యార్థులకు దూరంగా ఉంచాలి. గుట్కాలు, డ్రగ్స్, ధూమపానం వంటి వ్యసనాలకు లోనుకాకుండా పిల్లల ప్రవర్తనను బడిలో, ఇంట్లో గమనిస్తుండాలి. అభం శుభం తెలియని పిల్లలు దుష్ప్రభావాల బారిన పడకుండా వారిని సరైన దారిలో నడిపించే బాధ్యతను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమర్థవంతంగా నిర్వహించాలి. మేలైన పాత పద్ధతులను బడుల్లో తిరిగి ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులను క్రమశిక్షణతో మేటి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతుంది.
- అయినం రఘురామారావు, ఖమ్మం
‘డేరా’లు.. ఘోరాలు!
హర్యానాలో (అ)్ధర్మిక సంస్థ డేరా అధినేత రామ్ రహీం సింగ్ అత్యాచారం కేసులో ముద్దాయిగా కోర్టు తీర్పు వెలువడిన వెంటనే హింస ప్రజ్వరిల్లి 36మంది ప్రాణాలు కోల్పోవడం, వందలాదిమంది గాయపడడం, వేల కోట్ల రూపాయల ఆస్తి ధ్వంసం కావడం అత్యంత హేయం. హర్యానాలో ప్రభుత్వం అనేది ఉందా? అన్న సందేహం అందరికీ వచ్చే వుంటుంది. ముఖ్యంగా డేరా సంస్థ ఒక ఊరికో, వాడకో పరిమితం కాలేదు. లక్షలాదిమంది అనుచరులు, వేలకోట్ల ఆస్తులు కలిగి వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన ఒక వివాదాస్పద మానవ సమూహం. దాని అధినేత పట్ల ఆ అనుచరుల్లో ఉన్మత్త స్థాయిలో మూఢ విశ్వాసం. అయితే దురదృష్టవశాత్తు హర్యానాలో ప్రతీ రాజకీయ పార్టీ ఆ మూఢ భక్తిని వీలైనంత ఎక్కువగా పిండుకోవాలని చూసాయే తప్ప వారికి దూరం జరిగినవి కావు. పదిహేనేళ్లుగా ఆ అధినేతపై అత్యాచారం వంటి తీవ్ర నేరారోపణ లతో కేసులు నడుస్తున్నా, ఆయన పరపతికి వచ్చిన నష్టం ఏ మాత్రం లేకపోయింది. ఆయన దయతలిచి గత ఎన్నికల్లో బిజెపికి మద్దతునిచ్చాడు. ఆయన స్వచ్ఛ భారత్ స్ఫూర్తికి ప్రధాని కితాబు కూడా లభించింది. ఒక తీవ్ర నేరంలో నిందితుడిగా నిలబడ్డ ప్రబుద్ధుని పట్ల వుండాల్సిన స్పందన ఇదా? సరే! బురద రాజకీయాలు అనుకుందాం. అన్ని లక్షల మంది పిచ్చి అనుచరులు వున్నప్పుడు వ్యతిరేక తీర్పు రాగల అవకాశం, వచ్చిన తరువాత రాగల దొమీ అవకాశాలు ఊహించలేనివా? వాటి నివారణకు ప్రభుత్వం సిద్ధంగా వుండాలి కదా! ఒక నేరస్థుడికి శిక్ష ఖరారు చేయడానికి న్యాయమూర్తి తన న్యాయస్థానంలో రక్షణ ఉండదని భావించి జైల్లో తీర్పు చెప్పాల్సి రావడం దేశానికే సిగ్గుచేటు. ‘నాలుగు ఓట్లున్నవాడు నాగుపాములాంటి వాడైనా మాకు ఆప్తుడే’ అని రాజకీయ పార్టీలు అనుకునే వరకు పరిస్థితి మారదు. వారి ప్రాపకం కోసం వెంపర్లాడడం అంటే దేశాన్ని తాకట్టు పెట్టడమే.
-డి.వి.జి, పార్వతీపురం