ఉత్తరాయణం

భిసి నేతల ఐక్యత ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఒక్కరూ ‘కులమతాల కుమ్ములాటలు’ అంటూ నిరసన స్వరంతో మాట్లాడుతుంటారు. ఎప్పుడూ ప్రభుత్వాలకు హెచ్చరికలు చేసే బిసి సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య- రాజకీయ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలకు చెందిన బిసి నేతలను ఒక చోట చేర్చి పోరాడతామంటారు. పార్టీలకు అతీతంగా నేతలు ఒకచోట చేరి ప్రసంగాలు చేస్తారు. నిజంగా బిసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన నాడు- ఒకే కులానికి చెందిన వారు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేసినపుడు సఖ్యత ఎలా ఉంటుంది? ఎస్‌సి,ఎస్‌టి,బిసి, మైనారిటీల గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు దేశాన్ని ఏలినా ప్రధాన మంత్రిత్వం, పార్టీ నేతృత్వం నెహ్రూ కుటుంబం దాటి బైటకు రాలేదు. భాజపా మాత్రం ఓ బిసిని ప్రధానిగా, ఓ ఎస్‌సిని రాష్టప్రతిగా చేసి చూపింది. ఆర్.కృష్ణయ్యను బిసిల తరఫున సిఎం అభ్యర్థిగా గత ఎన్నికల ముందు టిడిపి ప్రకటించినా తెలంగాణ జనం ఆమోదించలేదు. మిగతా పార్టీల్లోని బిసి నేతలు సైతం ఆయనకు మద్దతు ఇవ్వలేదు.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్