ఉత్తరాయణం

‘ఆధార్’తో తంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధార్ కార్డు ఒక వ్యక్తి గోప్యతకు సంబంధించినదా? కాదా? ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు సెక్షన్-21 కింద అన్వయించుకోవచ్చా? అనే విషయమై అయిదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విచారించి ఈ వివాదంలో తుది నిర్ణయానికి అనేక మీమాంసలు వ్యక్తీకరించడంవల్ల ఈ సమస్యను మరలా తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనానికి నివేదించడం జరిగింది. ఆధార్ కార్డును అన్నిచోట్లా బహిర్గతం చేయడం వల్ల ముందు ముందు అనేక అనర్థాలు జరగవచ్చని ప్రముఖుల వాదన. ఎందుకంటే ఒక్క ఆధార్ నంబరు వల్ల బ్యాంకు ఎకౌంట్లు మొదలైన సమాచారాన్ని సైబర్ నేరస్థులు ఏదో విధంగా తెలుసుకుని మోసం చేసే అవకాశం వుందని అంటున్నారు. ఇప్పటికే రాన్సమ్ వేర్ అనే సైబర్ నేరం ప్రపంచం మొత్తాన్ని అనేక ప్రకంపనలకు గురి చేసింది. ఆధార్ నెంబర్‌ను ఐఎస్‌ఐఎస్ వాళ్లు నేరాలు చేయడానికి ఉపయోగిస్తున్నారని మొబైల్ మెసేజ్‌లు వస్తున్నాయి. ప్రభుత్వం, సుప్రీం కోర్టు సమన్వయంతో ఓ మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
అధికారుల బాధ్యత ఇదేనా?
ప్రజలకు జవాబుదారీగా వుండాల్సిన కొందరు ప్రభుత్వ అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్‌లో ఇటీవల జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో అధికారులు ఎక్కువ శాతం మంది సెల్‌ఫోన్స్‌తో కాలక్షేపం చేయడం టీవీ చానళ్లలో చూశాము. మరి కొందరు అధికారులైతే నిద్రలో జోగుతున్నారు. సాక్షాత్తూ సిఎం, డిప్యూటీ సిఎం వంటి ప్రముఖులు పాల్గొన్న సమావేశాల్లోనూ ఇవే సంఘటనలు జరిగాయి. ఒక ప్రభుత్వ శాఖలో తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం జరిగింది. వారిని తిరిగి విధులలోకి తీసుకోవాలని డిప్యూటీ సిఎం ఆదేశించినా అధికారులు మిన్నకుండినారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4వేలమంది విశ్రాంత ఉద్యోగులకు పదవీ విరమణ రోజున పూర్తి పించను అందించాలి. రిటైరైన రోజున ఆ ఉద్యోగిని ప్రభుత్వ వాహనంలో అతని ఇంటికి పంపించి రావాలని సిఎం గత డిసెంబర్‌లో ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ సిఎం ఆదేశాలను బేఖాతరు చేస్తూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పాలు చేస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ శాఖలకు సంబంధించి జరిగే వేలం పాటల్లో, టెండర్ల ప్రక్రియలో కొందరు ఉపాధ్యాయులు హాజరైనట్టు పత్రికల్లో చూసాం. ఇలా బాధ్యతా రహితంగా ప్రవర్తించే అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-ఎ.ఆర్.ఆర్.ఆర్.గౌడ్, ఖమ్మం
ఆక్రమణలతో అవస్థలు
వనస్థలిపురం సుష్మా టాకీసు నుండి హయత్‌నగర్ ఆర్టీసీ డిపో వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్డును కొందరు ఆక్రమించుకని దర్జాగా వ్యాపారాలు చేస్తున్నారు. ఫలితంగా పాదచారులు జాతీయ రహదారిపై నడుస్తూ ప్రమాదాలకు గురి అవుతున్నారు. రోడ్డుపైన వ్యాపారమే లక్షల్లో సాగుతుంది. విగ్రహాల తయారీతో, ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర వస్తువుల వ్యాపారాలతో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్నారు. రద్దీ సమయాల్లో పాదచారులు భయం భయంగా నడవవలసి వస్తోంది. ప్రధాన రహదారిపై నడవడం ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఫుట్‌పాత్‌లపై అక్రమ వ్యాపారాలను తొలగించాల్సిందిగా గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారుల్లో చలనం లేదు. నామమాత్రంగా ఒకటి రెండు తొలగించి ‘మమ’ అనిపిస్తారు. అధికారులు ఇకనైనా సర్వీసు రోడ్డును ఆక్రమించుకున్న వ్యాపారులను తొలగించి ప్రమాదాల బారి నుండి పాదచారులను రక్షించాలి.
-ఆర్.హరిశంకర్ గౌడ్, హయత్‌నగర్