ఉత్తరాయణం

‘భిగ్‌బోర్’ ఎన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ ప్రముఖ టీవీ చానల్‌లో వస్తున్న ‘బిగ్‌బాస్’ షో చాలా నిరాశపరచేలా వుంది. ఏ కార్యక్రమమైనా చూడడానికి వీక్షకుల్లో ఆసక్తి, ఉత్సాహం కలిగించాలి. ఎంతసేపూ కీచులాటలు, అంతఃకలహాలు, వాగ్వివాదాలు తప్ప అసలు ‘బిగ్‌బాస్’ ప్రోగ్రామ్‌లో పస లేదు. ఒకర్ని ఒకరు నరుక్కుంటారేమో అన్న సందేహం కూడా కలుగుతోంది. అందరు ఒక్కర్నే దోషిగా నిలబెట్టడం ఎలా వుందంటే సినిమాల్లో విలన్లంతా కలిసి హీరోమీద కక్ష సాధింపు చర్యలా వుంది. ఈ ప్రోగ్రామ్‌లో ‘మెయిన్ విలన్’ టీవీ ఆర్డిస్ట్ హరితేజ. ఆమెవలన ఈ బిగ్‌బాస్ బిగ్‌బోర్‌గా తయారైంది. ఆమె కింద పడుకుని కాళ్లతో మంచం మీద కొట్టడం, అందర్నీ వెనుకనుండి వెక్కిరించడం ఇదేనా గేమ్? అంటే. ఆమెలో రాక్షస గుణాలు ఎక్కువగా చూపెడుతున్నారు. దయచేసి ఆ క్యారెక్టర్‌ను ఎలిమినేట్ చేసేయాలి. ఇక ముమైత్‌ఖాన్ ప్రవర్తన చాలా అసహ్యంగా వుంది. ఆమెవలన ప్రోగ్రామ్ కలుషితమైపోయింది. ఇలాంటి ‘చెడు క్యారెక్టర్ల’ను తొలగించి ఇకనైనా ప్రోగ్రామ్‌ని సరిదిద్దుకుంటారా?
-ఎస్.దీపిక, పుంగనూరు
ఎందుకీ ‘అనుసంధానం’!
రోజూ మీడియాలో వస్తున్న వార్తలను చూసిగాని, తగినంత అవగాహన లేకపోవడం వల్ల గాని చాలామందిలో ఇపుడు భయాందోళనలు నెలకొంటున్నాయి. బ్యాంకుఖాతాకు పాన్ నెంబర్‌ను జోడించమన్నారు. గతంలో ఆధార్‌ను అనుసంధానం చేయాలన్నారు. ఇదివరకే మొబైల్ నెంబర్‌ను బ్యాంకు ఖాతాకు జతపరిచారు. ప్రభుత్వ రంగ మొబైల్ నెట్‌వర్క్ బిఎస్‌ఎన్‌ఎల్ కాక, అనేక ప్రైవేటు టెలికామ్ సంస్థలు పోస్ట్‌పెయిడ్, ప్రీ పెయిడ్‌గా సేవలందిస్తున్నాయి. ప్రైవేటు టెలికామ్ సేవలు పొందుతున్న వినియోగదారులు తమ చిరునామాను నమోదు చేసుకున్నారు. ఇపుడు ఫోన్‌లు ఉన్నవారంతా ఆధార్ సంఖ్యను కలపాలని హెచ్చరికలతో కూడిన మెసేజ్‌లు చేస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు ఆధార్ నెంబర్లు అనుసంధానమైనందున సంబంధిత బ్యాంకుల్లో నిల్వలకు ఎవరైనా ముప్పు తలపెట్టే అవకాశముందా? ఈ అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలి.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
నెరవేరని నోట్లరద్దు లక్ష్యం
ప్రధాని నరేంద్ర మోదీ గత నవంబర్‌లో ప్రకటించిన పెద్దనోట్ల రద్దు లక్ష్యం ఎంతో ఘనం. అది నల్లధనాన్ని అరికట్టడం. ఆ ప్రక్రియ ఇంతవరకు ఇచ్చిన ఫలితాల్ని చూస్తే మాత్రం లక్ష్యానికి లక్ష మైళ్ల దూరంలో ఆగినట్టుంది వ్యవహారం. కోట్లాది సామాన్యులు ఇబ్బంది పడినా, ప్రధాని ప్రకటించిన ఉన్నతాశయాన్ని గమనంలోకి తీసుకుని వౌనంగా అంగీకారం తెలిపారు. భవిష్యత్‌లో లబ్ది వుండకపోదా? అన్న జనం ఆశలకు రిజర్వు బ్యాంకు తాజా నివేదిక గండి కొట్టింది. రద్దయిన నోట్లన్నీ దాదాపు బ్యాంకులకు తిరిగొచ్చాయన్న విషయం, నల్లధనం సర్కులేషన్‌లోకి రావడానికి భయపడి రద్దు అయిపోతుందున్న ఆశల్ని పూర్వపక్షం చేసింది. నల్లధనాన్ని తెల్లధనంతో వేరుచేసే జల్లెడ భారీ చిల్లుల జల్లెడన్నమాట. అంతా కిందికే జారింది పొట్టు పొల్లు మొత్తంగా. ఫలితంగా జోరుమీదున్న ఆర్థిక రంగం అన్నివిధాలా మందగించింది. ఆక్సిలేటర్ అని భావించి ప్రధాని ‘బ్రేక్’ తొక్కారు. ఫలితంగా- ఆర్థిక రథం బోల్తా! ఇది వైఫల్యమా? ఉద్దేశపూర్వక ప్రయత్నమా? అన్న విషయాన్ని ప్రభుత్వం వివరించాలి.
-డా.డి.వి.జి.శంకరరావు, విజయనగరం