ఉత్తరాయణం

గురువరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువరా! మీ సందేశం
సర్వ శుభాలకు అదే సంకేతం గు

అజ్ఞానపు చీకటిలో- అలవికాని పోకడలో
తిరుగాడే ఈ మనిషిని తీరానికి చేర్చావు
జ్ఞానజ్యోతి వెలిగించి జాగృతం చేశావు గు

గురుదేవుల గురుతరమె మా భవితకు శుభకరము
తమరొసగిన జ్ఞానధనం మహోన్నతికి మూలధనం
మా ప్రతిభా పాటవాలు - తమ దీక్షా దర్పణాలు
మీ చల్లని వీక్షణాలు - దిగ్విజయపు కేతనాలు గు

బడియే గుడిగా - నవతరాల ఒరవడిగా
శిక్షణలో రక్షణలో - తల్లిదండ్రుల ఒడిగా
పొరబడినా- తడబడినా- వడివడిగా నడక నేర్పి
చిన్నారుల చేయిబట్టి - రతనాలుగా సానబట్టి
నవయుగాన్ని నిర్మించిన జగమెరిగిన జ్ఞాని మీరు గు

ప్రతిన మీరు - ప్రతిభ మీరు - ఘనత మీరు చరిత మీరు
సమసమాజ స్థాపనలో - దివ్యమైన దివ్వె మీరు
మీ సేవలు అనన్యం - అమోఘం - అద్భుతాల సౌజన్యం
సత్య ధర్మ సాధనలో - సమత - క్రమత సద్భావన పయనంలో
శక్తి మీరు - యుక్తి మీరు - భరత జాతి
భాగ్యానికి సహం సామ్రాట్టు మీరు గు
- మల్లాడి శ్రీనగేష్, హైదరాబాద్
*
గురువులదే కీలక బాధ్యత
తల్లిదండ్రులు, దైవంతో సమానుడు గురువు అంటారు. ఈ ముగ్గురి కంటే గురువే శిష్యునికి సమస్తం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే గురువు బాధ్యతే ఎక్కువగా వుంటుంది. కేవలం మంచి మార్కులే లక్ష్యంగా పాఠ్యాంశాలను బోధించడం గురువు బాధ్యత కాదు. విద్యార్థులను నైతికంగా తీర్చిదిద్దాలి. అవలక్షణాలను దూరం చేసి వారిని ఉత్తమ పౌరులుగా తయారు చేయాలి. నీతి పద్యాలను బోధిస్తూ వాటిలోని మంచి గుణాలను విద్యార్థులు ఆచరించేలా చేయాలి. మహాత్ముల గాధలను, చరిత్రను బోధించడంలో లక్ష్యం విద్యార్థులు అలా మారాలని ఆశించడం, జాతినేతలలోని విశిష్ట గుణాలను ఆచరించడం. పిల్లలకు ఇంట్లో, బడిలో వీలైనంత వరకు నీతి కథలను చెప్పి, వారిలో మంచి అలవాట్లను ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు సైతం విలువలను పాటిస్తూ విద్యార్థులకు స్ఫూర్తిదాతలుగా నిలవాలి. ప్రతి ఒక్క విద్యార్థినీ నైతిక విలువలు పాటించేలా తయారుచేస్తే సమాజం శాంతి యుతంగా వుంటుంది.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం