ఉత్తరాయణం

రోహింగ్యాల గొడవ మనకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయన్మార్ నుంచి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వేలాదిమంది రోహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వాలని మన రాజకీయ నాయకులు కొందరు చేస్తున్న సూచనలు సహేతుకం కాదు. గాలికిపోయే కంప ఒంటికి తగిలించుకున్న చందంగా ఉంది ఈ సలహా. ఇప్పటికే ఎన్నో సమస్యలతో ఉన్న మనం ఇప్పుడు సరికొత్త సమస్యను కొని తెచ్చుకోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. మయన్మార్ రోహింగ్యాల సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ఆ దేశానికే ఉంది. లేదా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని పరిష్కరించాల్సి ఉంటుంది. మానవతా దృక్పథంతో ఆశ్రయం ఇచ్చి పౌరసత్వం ఇస్తే వారి హక్కుల కోసం పోరాడేవర్గం ఉందేతప్ప వారి బాధ్యతలను గుర్తుచేసేవారు ఇక్కడ ఉండరు. ఉన్నా వారి మాట చెల్లదు. దేశ భద్రతను తాకట్టుపెట్టి మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఏమాత్రం చూపనక్కరలేదు. ఓట్ల రాజకీయంతో తప్పుడు సలహాలు ఇవ్వడం, ఒంటెత్తుపోకడతో నిర్ణయాలు తీసుకుంటే మూల్యం చెల్లించేది ప్రజలే.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట
ప్రాణం తీస్తున్న పుకార్లు
ముంబైలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన గుండెలను కుదిపేసింది. కొందరు వ్యక్తులు ప్రచారం చేసే అవాస్తవాలు ఇలాంటి దురదృష్టకర సంఘటనలకు కారణమవుతున్నాయి. ఇలా పుకార్లను వ్యాపింపచేసే వ్యక్తులను గుర్తించి శిక్షించే వ్యవస్థను రైల్వే శాఖ నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజు ముంబైలోని ఒకటి రెండు ప్లాట్‌ఫారాల మధ్య కనీసం రెండు లక్షలమంది ప్రయాణికులు వచ్చి వెళుతుంటారు. గతంలో ఎన్నోసార్లు తొక్కిసలాట సంఘటనలు జరిగాయి. ఎన్నో హెచ్చరికలూ చేశారు. అయినా సకాలంలో అధికారులు స్పందించకపోవడం వల్ల ఇప్పుడు భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటికైనా అక్కడ విశాలంగా ఉండే అధునాతన వంతెనను నిర్మించాలి. ఈ దుర్ఘటనతోనైనాసరే ప్రయాణికులు చైతన్యవంతులవ్వాలి. తొందరపాటుగా వ్యవహరించి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోరాదు.
-బి.మధుసూదన్ రెడ్డి, బేతంచర్ల
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం లేదా?
సర్కారు బడుల్లో చదివించాలని, ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని కబుర్లు చెప్పే రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవారు చెబుతుంటారు. కానీ సొంత విషయాలు వచ్చేసరికి ఆ పని చేయరు. పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తారు. వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానాలను ఆశ్రయిస్తారు. హైదరాబాద్‌లో ప్రఖ్యాత కంటి చికిత్స ఆస్పత్రులు ఉన్నప్పటికీ మన నేతలు ఢిల్లీలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటే ఇక్కడి సంస్థలకు విలువ ఎక్కడి నుంచి వస్తుంది. నిజానికి ఢిల్లీ నేతలు మన ఆస్పత్రులకు వచ్చి చికిత్స చేయించుకుంటుంటే మన నేతలు అక్కడికి వెళ్లడంలో అర్థం ఏమిటి? శాసన మండలి ఎన్నికల్లోనూ అదే తంతు నడుస్తోంది. పట్ట్భద్రుల ఓట్లతో నెగ్గే ఎమ్‌ఎల్‌సి పట్ట్భద్రుడై ఉండనక్కరలేదా? ఉపాధ్యాయ ప్రతినిధి ఉపాధ్యాయుడై ఉండాల్సిన అవసరం లేదా? అలాంటప్పుడు సామాన్యులకు కర్మసిద్ధాంతమే దిక్కు.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్