ఉత్తరాయణం

జాతీయ భావాన్ని రగిలిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం మొత్తాన్ని ఒక్కటిగా నిలిపిన స్వాతంత్య్ర ‘ఉద్య మం నేటికీ స్ఫూర్తిదాయకం. లక్షలాది మంది వీరుల బలిదానం, మహనీయుల పోరాట ఫలితం మన స్వాతం త్య్రం. స్వాతంత్య్రం కంటే ముందు ప్రజలందరిలో కల జాతీయస్ఫూర్తి నేడు కొరవడింది. నేడు కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు పెరిగిపోతున్నాయి. దేశభక్తిని రెండు రోజులకు (ఆగస్టు 15, జనవరి 26) పరిమితం చేస్తున్నాము. దేశ స్వాతంత్య్రం స్వాభిమాన చరిత్రను నేటి తరానికి అందజేయలేకపోతున్నాము. ప్రజలు అందరూ సంకుచిత ధోరణులు విడిచిపెట్టాలి. అందరిదీ జాతీయభావం కావాలి. జాతి సమైక్యతా స్ఫూర్తిని ఎల్లవేళలా కొనసాగించాలి. జాతీయ వాదానికి అందరం పెద్దపీట వేయా లి. దేశాభివృద్ధికి దేశ పౌరుల దేశభక్తియే గీటురాయి. కావు న జాతీయ భావనతో అందరం దేశాభివృద్ధికి నడుం బిగించాలి. కులవాదం, మతవాద ధోరణులకు స్వస్తిచెప్పి జాతీయవాదానికి అండగా నిలుద్దాం.
- సామల కిరణ్, జూలపల్లి

శ్రీమంతుల పాలన!
ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) సంస్థ తాజా సర్వే నివేదిక ప్రకారం కేంద్ర మంత్రివర్గంలో 76 శాతం మంది కోటీశ్వరులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మం త్రులంతా కోటీశ్వరులే. శ్రీమంతులు పాలకులుగా ఉండడం లో ఎవరికీ అభ్యంతరం ఉండనక్కరలేదు. పాలనకు, ప్రజాసేవకు అనర్హతా కాదు. డబ్బు లేకపోవడం అర్హతా కా దు. అయతే నూటికి ఎనభై మంది కటిక పేద లున్న దేశా నికి, అందునా ప్రతి ఒక్కరికీ ఓటుహక్కున్న ప్రజా స్వా మ్య దేశానికి పాలక ప్రతినిధులంతా శ్రీమంతులు కావడమే కాస్త విరోధాభాస. కొంచెం ఎబ్బెట్టు. మన దేశంలో పేదలు తగ్గా రని చెప్పుకోవడానికి రోజుకు ముప్పయ రూపాయల సంపాదన ఉన్నవారంతా దారిద్య్రరేఖకు ఎగువ వైపునకు తోసే యత్నాలు ప్రణాళికా సంఘం గతంలో చేసింది. అయ నా ఆరేఖ కూడా దాటడానికి మూడింట రెండొంతుల జనాభా ముక్కి, మూలిగి క్రిందనే అయనా ఆలా ఈ వార్త చూసి ఆశ్చర్యపోతే అమాయకత్వమే. ఎందుకంటే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంతుందో ఎవరికి తెలియనిది? ప్రధాన పక్షాలన్నీ అభ్యర్థుల ఎంపికలో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఓడినా, గెలిచినా బరిలో ఉండేది కుబేరులే కదా. అప్పుడు ముఖ్యమంత్రులైనా, ప్రధాని అయనా ఆ కుబేరుల్లో మహా కుబేరులనే ఎంచుకోవాలి కదా. అలా అని ఎంత సరిపెట్టు కున్నా ఏదో అసంతృప్తి ప్రజా స్వామ్యంలో.. పాలకుల్లో మొహమాటానికైనా కొన్ని సామాన్య ముఖాలుంటే బాగుండేదే అని. అంతకన్నా సీరియస్ విషయం ఏమంటే వివిధ రాష్ట్రాల మంత్రుల్లో 609 మందిలో 113 మంది తీవ్ర నేర చరిత్ర కలవారు. అదే కేంద్ర మంత్రుల్లో 78 మందికి 14 మంది. అంటే సరిగ్గా కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాల్లో తీవ్ర నేర చరిత్ర కలవారికి 18 శాతం రిజర్వేషన్ నిక్కచ్చిగా అమలవుతున్నది. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు ఎంత అత్యావశ్యకమో మరొక్క సారి ఋజువైంది. ఫలానా పార్టీని వేలెత్తి చూపడంలో అర్థం, ప్రయోజనం లేదు.
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం

తగ్గుతున్న పులుల సంఖ్య
ఇటీవల జాతీయ వన్యప్రాణుల పరిరక్షణ సంస్థ జరిపిన సర్వేలో జాతీయ జంతువైన పులుల సంఖ్య గత నాలుగేళ్లలో బాగా తగ్గినట్లు తేలడం దురదృష్టకరమైన పరిణామం. దేశంలో అతి పెద్ద ఫారెస్టులలో ఒకటైన నల్లమల్ల అడవులలో కూడా పులులు సంఖ్య సగానికి సగం తగ్గిపోయిందన్న సదరు నివేదిక వన్యప్రాణుల సంరక్షణ చట్టం, ప్రాజెక్ట్ టైగర్ పథకాలను మరింత కట్టుదిట్టంగా అమలుచేయకపోతే వచ్చే దశాబ్దకాలంలో పులులు అరుదైన జంతువుల జాబితాలోకి చేరే ప్రమాదం వుందని హెచ్చరించింది. వివిధ కారణాలవలన వన్యప్రాణులు తగ్గిపోవడంతో క్రూర మృగాలకు ఆహారం లభించడం లేదు. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, వన్యప్రాణుల వేట పెరగడం, పులి చర్మాలు, గోళ్లకు గిరాకి పెరగడంవలన వేటగాళ్ల తుపాకి గుళ్లకు పులులు బలైపోతున్నాయి. కొంత మంది సెలబ్రిలు కూడా జంతువధకు పాల్పడుతున్నారు. మానవుల స్వార్థానికి జంతులోకం దారుణంగా బలైపోతోంది.
- ఎం.కనకదుర్గ, తెనాలి