ఉత్తరాయణం

అవయవదానం గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నదానం, వస్తద్రానం కంటే అవయవ దానం చాలా గొప్పది. బ్రెయిన్‌డెడ్ అయిన వారి, కోమాలోకి వెళ్లి సాధారణ పరిస్థితికి రావడం అసాధ్యమైన పరిస్థితులలో క్షతగాత్రుని రక్తసంబంధీకుల అనుమతితో, చట్టపరమైన అనుమతుల ద్వారా అవయవ దానం చేస్తే ప్రత్యక్షంగా మరొక రోగికి పునర్‌జీవితం ప్రసాదించిన వారౌతారు. విదేశాలలో ఈ అవయవ దానంపై మంచి అవగాహన కలిగి నిస్వార్థంగా దానం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే మన దేశంలో ఈ విషయంలో ప్రజలలో ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాలలో అవగాహ న చాలా తక్కువ అనీ చెప్పాలి. అవయవమాదం చేస్తే పాపం వస్తుందన్న మూఢ నమ్మకాలు కూడా సమాజంలో గాఢంగా ప్రబలుతుండడం ఈ ప్రక్రియ జనాదరణ పొందకపోవడానికి ఒక కారణం. అయితే ఈ అవయవదానంతో పలు కార్పొరేట్ కంపెనీలు పెద్దఎత్తున అనైతిక వ్యాపారాలకు పాల్పడుతున్నాయన్న వార్తలు ఇటీవల మీడియాలో వచ్చాయి. కిడ్నీలు, లివర్, గుండె వంటివి ఎటువంటి అనుమతులు లేకుండా తీసి అమ్మేసుకున్న సంఘటనలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. అందుకే అవయవ మార్పిడిపై చట్టాలను కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత వుంది. అంతేకాక ఇటువంటి ప్రక్రియలు ప్రభుత్వాసుపత్రులలో కూడా అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో జరిగేటట్లు వసతుల రూపకల్పన జరగాలి. రిఅవయవ దాతలకు మీడియా ద్వారా విశేషమైన ప్రచారం కల్పించాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి

ఆలయాలు మఠాల ఆదర్శ నిర్వహణ
రాజకీయవేత్తల జోక్యాలవల్ల వీటిని స్వప్రయోజనాలకు వాడుకోవడంవల్లా, ఎన్నో అస్తవ్యస్తంగా ఉన్నాయి. భూముల అన్యాక్రాంతం ద్రవ్యం దుర్వినియోగం చాలాచోట్ల జరుగుతున్నది. ఆలయ కమిటీలు చాలాచోట్ల రాజకీయవేత్తల ప్రతినిధులే. మత మార్పిడులు విపరీతంగా జరుగుతుంటే పట్టించుకోరు. వారికి హోదాలే ముఖ్యం. ముఖ్యమంత్రి గారికి ఎన్నో పనులున్నాయి. అదనంగా ఆలయాల, మఠాల నిర్వహణ ఎందుకు? ఎట్టి రాజకీయాలు లేకుండా ఉండాలంటే, గవర్నరు వ్యక్తిగత పర్యవేక్షణలో ఉండాలి. ధార్మిక మండలులను గవర్నరు,రాజకీయాలు లేకుండా పండితులతో ఐఎఎస్ వారితో ఆర్థికవేత్తలతో చార్టర్డు ఎకౌంట్ వారితో ధార్మిక సంస్థల ప్రతినిధులతో దాతల వంశీయులతో న్యాయశాఖ వారితో అనుభవజ్ఞులతో నియమించాలి. ఇంటింటా ధర్మప్రచారం జరగాలి. లేకపోతే హిందూమతం క్షీణిస్తుంది.
- ఈమని సువర్ణం, కపిలేశ్వరపురం

మార్పుతోనే అభివృద్ధి
మార్పులేనిదే అభివృద్ధి లేదు. మనసు మారనిదే మ నం దేన్నీ మార్చలేం. ఆరెస్సెస్ తన గణ వేషలోని ముఖ్య భాగం నిక్కర్‌ను మార్పుచేయవలయునని నిర్ణయించుకుంది. ఆరెస్సెస్‌లో ముఖ్యమైనది. గుర్తింపు కలిగింది. పథ్రిక వాళ్ళకు మింగుడు పడలేదు. ఊహించను లేదు. కాని ప్రచార మీడియా వాళ్ళకు వారం రోజులకు సరిపడ సామగ్రి లభించింది. ఒక ఛానల్ ప్రసారం చేసిన వార్తలో ‘ఆరెస్సెస్ ఒక మెట్టు దిగి వచ్చింది’’ పదే పదే చూపించారు. ఆరెస్సెస్‌లో ముఠాలు లేవు. వర్గాలు లేవు, పదవుల కోరడం లేదు ఎందుకింత దుమారం? సిద్ధాంతాన్ని కూడ మార్చుకోలేదు. నిక్కరు పై ఎక్కడ వ్యతిరేకత లేదు. నిక్కరు ధరించి గర్వంగా ఫీల్ అవుతారు. ఆరెస్సెస్‌లో అనుశాసనం ఉంది. ఆజ్ఞాపాలన ఉంది. క్రమశిక్షణ ఉంది. దేశంకోసం జీవించే మనస్తత్వం ఉంది. నిక్కరు మారినా దాని స్థానంలో ప్యాంటు వచ్చినా యేమీ తేడా రాదు. ఎందుకంటే దాని సిద్ధాంతాన్ని విడవదు. భలే హీ ప్రాణ్ జాయే. భయపడేది లేదు. ఆత్మరక్షణ కొరకు దండ స్థానంలో తుపాకులు రావాలి. తుపాకులు వచ్చిన క్రమశిక్షణను, సిద్ధాంతాన్ని వీడేది లేదు. శతృవులు బాంబులతో, తుపాకులతో దాడికి పాల్పడుతున్నారు. ఇది సా ధ్యంకానిది. ప్రస్తుతానికి అవసరం లేనిది. ప్రజల్లో చైత న్యం మార్పుకోరేది రాష్ట్రీయ సేవక్ సంఘం. మార్పు తె చ్చేది గూడా ఆరెస్సెస్ మాత్రమే.
- గుడ్ల జగదీశ్వర్, హైదరాబాద్

తెలుగు భాషకు పట్టం కట్టాలి
తెలుగు భాషోద్యమకారులు, అభిమానుల విశేష కృషి కారణంగా తిరుపతిలో 2012లో తెలుగు ప్రపంచ మహాసభలను నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి తెలుగు మంత్రిత్వశాఖను ఏర్పాటు సాధించుకున్నారు. అయితే తోలుబొమ్మలాంటి అధికార భాషా సంఘం, తెలుగు మంత్రిత్వశాఖ రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషి శూన్యం. ప్రతీ తెలుగు భాషా దినోత్సవంనాడు ఆ ర్భాటంగా ప్రకటనలు చేయడం తప్ప తెలుగు ప్రజలకు ఒరిగిందేమీ లేదు! అందుకే క్రియాశీలకంగా పనిచేసేందుకు పొరుగు రాష్ట్రాల వలే తెలుగు డెవలప్‌మెంట్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం