ఉత్తరాయణం

దేశీయ విత్తనాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్లలోకి కుప్పలుతెప్పలుగా వస్తున్న బెంగళూరు టమాటా, హైబ్రీడ్ రకం టమాటాలు సరిగా ఉడకడం లేదు. వీటికి పులుపుండదు. రుచి లేని ఈ రకం టమాటాలకు బదులు రైతులు దేశీయ విత్తనాలను వాడితే వినియోగదారులకు ఫలితం ఉంటుంది. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రైతులకు దేశీయ విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలి. మిగతా కూరగాయలకు సంబంధించి కూడా దేశీయ వంగడాలను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. విదేశీ విత్తనాల ఆధిపత్యాన్ని అరికట్టాలి. రైతన్నలు కూడా దేశీయ విత్తనాలు ఎక్కడ దొరికినా తెచ్చుకుని నాటుకొంటే బాగుంటుంది.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్

ఖానాల్ని ఏర్పాటుచేయండి
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మల్లయ్యపేట సమీపంలో సాయన్నగెడ్డలో ఖానాలు బాగా దెబ్బతిన్నాయి. రైతులు పొలాలకు నీరందటం లేదు. సాగునీరు వృథాగా పోతున్నందున రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మల్లయ్యపేట, మంతిన పరిసర గ్రామాల రైతులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ఇరిగేషన్ విభాగ అధికారులు తక్షణం స్పందించి రైతుల్ని ఆదుకోవాలి. నాగావళి నది కుడి కాల్వలో మంతిన వద్ద ఖానాలు ఏర్పాటు చేయాలని, ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
- మూల శ్రీనివాసరావు, మల్లయ్యపేట

విద్యార్థుల్లో అలసత్వం
నేడు చాలామంది విద్యార్థులు తమ తల్లిదండ్రులను డబ్బులు పండించే యంత్రాలుగా ఉపయోగించుకుంటూ వారి మాటలు పెడచెవిన పెడుతున్నారు. కొందరు యువతీ యువకులు హెయిల్ స్టయిల్ మీద చూపుతున్న శ్రద్ధ కన్నా- తల్లిదండ్రులతో గడిపేందుకు విముఖత చూపుతున్నారు. ఎప్పుడు సెల్‌ఫోన్స్ పట్టుకొని వాటితోనే జీవనం అన్నట్లు ఎక్కువ సమయం వాటితోనే వెచ్చిస్తున్నారు. ఇంట్లో ఉన్నా, జర్నీలో ఉన్నా ఎక్కడ ఉన్నా సెల్‌ఫోన్ అవసరంగా మారింది. ఒక్క క్లాసురూమ్‌లో తప్ప మిగతా సమయంలో సెల్‌ఫోన్ పైనే ఉంటారు. బంధువుల ఇంటికి వెళ్ళినా, వారి సిస్టమ్ మీద లేదా వారి సెల్‌ఫోన్స్‌తో ఆడుకోవటం తప్ప, ఆప్యాయంగా పలకరించటం, అందరితో కలిసిమెలిసి ఉండే సంస్కృతిని అలవరచుకోవటం లేదు. తల్లిదండ్రుల కష్టం గురించి ఆలోచించి మెలగాలనే ఆలోచన లేక, అంతా తమకే తెలుసునని యువత ప్రవర్తించడం బాధాకరం.
- అయినం రఘురామారావు, ఖమ్మం

అగ్రకుల పేదలకూ రిజర్వేషన్లు
ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ చేసి, దాన్ని 75 శాతానికి పెంచి, అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథావలె ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆయన సలహా నూటికి నూరు శాతం ఆహ్వానించదగ్గదే! దేశంలో అగ్ర కులాలను పదరిశీలిస్తే వారిలో ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలు నూటికి 75 శాతమున్నట్లుగా నిర్ధారణ అవుతున్నది. రాజకీయవేత్తలు తమ స్వార్థప్రయోజనాలకై కులాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించి, విభజించి పాలించే విధానాన్ని అమలు చేస్తున్నారు. కుల ప్రసక్తిలేకుండా, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి మాత్రమే రిజర్వేషన్లు కల్పించి, ప్రజలందరు ఒక్కటేననే ధోరణితో చూడాలి. కుల, మత ప్రసక్తిలేకుండా బీద కుటుంబాలను సర్వే ద్వారా నిర్ణయించి రిజర్వేషన్లు కల్పించాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం

కాంట్రాక్టు లెక్చరర్ల వెతలు
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. పాఠశాలల్లో విద్యావాలంటీర్లకు 8 వేల రూపాయలు ఇస్తున్నారు. కానీ, కళాశాలలో అతిథి అధ్యాపకులు ఉత్తమసేవలు అందిస్తున్నా గంటల ప్రాతిపదికపై జీతాలు ఇస్తున్నారు. సెలవులు మినహాయించి జీతాలు ఇవ్వటం సమంజసం కాదు. కనీసం 15వేల రూపాయలు వేతనం అతిథి అధ్యాపకులకు చెల్లించాలి. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల జీతం 10వేల రూపాయలకు ప్రభుత్వం పెంచింది. కాంట్రాక్టు అధ్యాపకులకు 15వేలు పెంచుతూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. చాలీచాలని జీతాలతో బతుకులు నడుస్తున్న వేల కుటుంబాలను ఆదుకోవాలి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తగు నిర్ణయం వెంటనే తీసుకోవాలి.
- కమ్మరి శ్రీనివాసాచారి, దౌల్తాబాద్

ఐటి నుంచి మినహాయించండి
ఏడున్నర లక్షల రూపాయల కన్నా తక్కువ వార్షికాదాయం వున్నవారిని మధ్యతరగతి వర్గంగా ఇటీవల కేంద్రం పరిగణించింది. ప్రస్తుతం రూపాయి విలువ తగ్గిపోతున్నది. అందువల్ల వార్షికాదాయం రూ.7.5 లక్షలుగా నిర్ణయించడం బావుంది. కాగా, ఆదాయపు పన్ను (ఐటి)ను వార్షికాదాయం రూ.3 లక్షలు దాటిన వారి నుంచి వసూలు చేస్తున్నారు. ఆదాయపుపన్ను పరిమితిని కూడా రూ.7.5 లక్షల వార్షిక ఆదాయం పొందే మధ్యతరగతి వారికి వర్తించకుండా నిర్ణయం తీసుకొని ఆ వర్గాల వారికి ఊరట కలిగించాలి. అలాకాని పక్షంలో ఐటి పరిమితిని 5 లక్షలుగా నిర్ణయించాలి.
- గర్నెపూడి వెంకట రత్నాకరరావు, హనుమకొండ