ఉత్తరాయణం

కళాకారులు మాట్లాడరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ మనకు శత్రుదేశం. ఉగ్రవాదులు మనకు శత్రువులే. కానీ, పాక్ కళాకారులు మనకు మిత్రులే. యూరీ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ కళాకారులు మన దేశం నుంచి వెళ్లిపోవాలంటూ కొందరు నేతలు డిమాండ్ చేస్తుండగా, కళాకారులు వస్తూపోతుంటేనే రెండు దేశాల మధ్య మైత్రి పెరుగుతుందని కొందరు మేధావులు చెబుతున్నారు. అయితే, ఇన్నాళ్లుగా ఈ కళాకారులు పాక్, భారత్ మధ్య మైత్రి కోసం ఏం చేశారో మేధావులు సెలవివ్వాలి. సంపాదనే ధ్యేయంగా కళను వృత్తిగా స్వీకరించిన వారు నిజమైన కళాకారులేనా? పాక్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఆ దేశ కళాకారులు ఎపుడైనా ఖండించారా? ప్రజల మనోభావాలను కూడా కళాకారులు గమనించాలి.
-వరిగొండ కాంతారావు, హనుమకొండ

చదువంటే ఇదేనా?
నేడు పాఠశాలల నుంచి కళాశాలల వరకూ విద్యార్థులు మార్కులపైనే దృష్టి పెడుతున్నారే తప్ప శాస్ర్తియ అవగాహన, సామాజిక పరిస్థితులపై ఎలాంటి అవగాహన ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఎపుడూ పిల్లల ర్యాంకులు, మార్కులపైనే ఆసక్తి చూపుతున్నారు. యోగా, శరీర సౌష్టవం, క్రీడలు, ఆరోగ్యం, లైంగిక విజ్ఞానం, శాస్ర్తియ అవగాహన, లోకజ్ఞానం వంటి విషయాల్లో విద్యార్థులు బాగా వెనుకబడిపోతున్నారు. ఈ అంశాల్లోనూ అవగాహన ఉంటే ఎలాంటి సమస్యలనైనా విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కొనగలుగుతారు. క్రీడలు, శరీర సౌష్టవంపై దృష్టిపెడితే పోలీసు శాఖలో, రక్షణ రంగంలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది.
-కె.కుమార్, విశాఖ

పాక్,చైనాలను వెలివేయాలి
మన దేశంలో ఎన్నో ఉగ్రదాడులకు కారణమైన పాకిస్తాన్‌ను, ఆ దేశానికి మద్దతుగా నిలిచిన చైనాను భారత్ అంతర్జాతీయంగా వెలివేయాలి. ఉగ్రదాడులకు పాక్ పాల్పడినట్లు ఇప్పటికే ఎన్నో ఆధారాలు లభించాయి. వాటిని ఐక్యరాజ్యసమితికి సమర్పించి పాక్‌ను, చైనాలను వెలివేసేలా భారత్ ఒత్తిడి తేవాలి. పార్లమెంటులో కూడా ఈ మేరకు ఒక తీర్మానం చేసి ఐక్యరాజ్యసమితికి పంపాలి. యూరీ దాడులను ఖండిస్తూ ఇప్పటికే పలు దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి. పాక్ ఆగడాలను అంతర్జాతీయ స్థాయిలో నిలదీసి మిగతా దేశాల సంఘీభావాన్ని కూడా మన దేశం పొందాలి. పాక్, చైనాలను ఐరాస వెలివేస్తే ఉగ్రవాదానికి మద్దతునిచ్చే మిగతా దేశాలు కూడా భయపడతాయి.
-సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ

గ్రామాలకు బస్సుల రద్దు
ఏదైనా పండగ వస్తే చాలు ఆర్టీసీ యాజమాన్యం పట్టణ ప్రాంతాలకు అధిక సంఖ్యలో బస్సులు నడిపేందుకు మొగ్గు చూపడం ఆనవాయితీగా మారింది. ప్రైవేటు ట్రావెల్స్ వలే పండగ సందర్భాల్లో ఆర్టీసీ కూడా రేట్లు పెంచేస్తోంది. డీలక్స్, లగ్జరీ, గరుడ వంటి బస్సులే కాదు, పల్లెవెలుగు బస్సులను కూడా పట్టణాలకు నడుపుతున్నారు. పల్లెవెలుగు బస్సులకు బోర్డులు మార్చేసి పండగ రద్దీ దృష్ట్యా పట్టణాలకు పంపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు తగ్గుతున్నాయి. పల్లెలకు వెళ్లాల్సిన బస్సులను రద్దు చేయడం సమంజసమేనా? పండగ సందర్భాల్లో పల్లె ప్రజలు బస్సులు లేక ఇబ్బందులు పడాలా? పండగ సందడి పట్టణాలకేనా? పల్లెవెలుగు బస్సులను రద్దు చేయడం కన్నా, పట్టణాలకు అదనపు బస్సులను నడిపేలా ఆర్టీసీ దృష్టి సారించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

పర్యావరణానికి హాని
ఇంకుడు గుంతలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు చేయగానే సరిపోదు. పర్యావరణంలో భాగమైన నీరు, నిప్పు, ఆకాశం, గాలి, భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై వుంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. ఆహారోత్పత్తులను సైతం కొందరు తమ లాభం కోసం కల్తీ చేస్తున్నారు. ఆ ఆహారోత్పత్తులను తిన్న వారు రోగాల బారినపడుతున్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల ప్రకృతికి కూడా కొందరు హాని కల్గిస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని నష్టపరుస్తున్న ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. భూమిపై వేడి ఎక్కువై హిమఖండాలు కరిగి భూమిని కొద్దికొద్దిగా ముంచుతున్నాయి. అడవులను ఎవరికివారు ఇష్టానుసారంగా నరుకుతూ వినాశనాన్ని సృష్టిస్తూ వన్యప్రాణులకు హాని కలిగిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువుకు కరువు ఏర్పడుతున్నది.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు

సైరన్‌లో తేడా వద్దా?
నేడు చాలా ప్రాంతాల్లో పోలీసు వాహనాలకు, అంబులెన్స్‌లకు సైరన్‌లో తేడా ఉండడం లేదు. రెండు సైరన్‌లు ఒకేలా ఉండడంతో ట్రాఫిక్‌లో ఉన్న వాహన చోదకులకు ఏది పోలీసు వాహనమో, ఏదీ అంబులెన్సో దగ్గరకు వస్తేగానీ తెలియడం లేదు. అంబులెన్స్‌కు ముందుగా దారి ఇవ్వాల్సి ఉన్నందున దాని సైరన్ ప్రత్యేకంగా ఉండాలి. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రోగులను ఆస్పత్రులకు తీసుకువెళ్లే అంబులెన్స్‌లను మిగతా వాహన చోదకులు సులువుగా గుర్తు పట్టేలా సైరన్ ఉండాలి. అంబులెన్స్ సైరన్‌ను ఇతర వాహనాలకు వాడకుండా ప్రభుత్వం తగిన ఆదేశాలు ఇవ్వాలి.
-గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ