ఉత్తరాయణం

చైనా ద్వంద్వనీతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడు మసూద్ అజహర్‌ని ఉగ్రవాదిగా ప్రకటించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐరాసలో భారత్ తీర్మానిస్తే చైనా మాత్రం ‘వీటో’ చేసింది. ఇప్పుడు అదే చైనాకు చెందిన అధికార ప్రతినిధి- సీమాంతర ఉగ్రవాదంపై ప్రపంచం గట్టిగా స్పందించాలని న్యూయార్క్ సదస్సులో గంభీర ఉపన్యాసం చేయడం విడ్డూరం. చైనా డ్రాగన్‌కి రెండు తలలు, రెండు నాలుకలు! చైనా దృష్టిలో ఉగ్రవాదులెవరో, అమాయక చక్రవర్తలెవరో ఓ జాబితా ప్రచురిస్తే బాగుంటుందేమో!
- లక్ష్మీప్రసన్న, పేర్రాజుపేట

స్వాతంత్య్ర పోరాటమంటే?
కాశ్మీర్‌లో జరిగేది స్వాతంత్య్ర పోరాటమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సెలవిచ్చాడు. పోరాటమంటే- కాశ్మీర్ అంశంతో సంబంధంలేని భారత్‌లోని అమాయక పౌరుల్ని చంపటమా? విధ్వంసాన్ని సృష్టించటమా? పాక్ చర్యలన్నీ ఉగ్రవాదమే అవుతాయి. ఉగ్రవాదాన్ని స్వాతంత్య్ర పోరాటమంటే భారతదేశం సహించాలా? కాశ్మీరీలు పోరాటం చేయాల్సింది పాక్ ప్రభుత్వం పైనే! మతోన్మాదులు చేసే అరాచకాల్ని ఉగ్రవాదమే అంటారు. స్వాతంత్య్ర పోరాటాలతో పోల్చరు. భారత్ చేస్తున్నది పొరపాటు అని పాక్ నేతలు చెబితే ప్రపంచం నమ్ముతుందా? ఐరాస పాక్ వాదనను సమర్థిస్తుందా? ఐరాసలో దీనిమీద చర్చ జరగాలి. పాకిస్తాన్ కుటిల నీతిని ప్రపంచ దేశాలు తీవ్రంగా నిరసించాలి. సరిహద్దుల్లో తిష్టవేసుకొని ఉన్న ఉగ్రవాదులను భారత్‌లోకి రానీయకుండా మట్టుపెట్టాలి. పాక్ ఉగ్రవాదులకు దడ పుట్టించాలి. దేశ రక్షణ కోసం భారత సైనికులు అవసరమైతే మళ్లీ హద్దుదాటి పాక్‌కు బుద్ధి చెప్పాలి. సైన్యానికి రాజకీయ పార్టీలు, నాయకులు, దేశ ప్రజలంతా అండగా నిలిచి మానసిక స్థైర్యం కలిగించాలి.
- పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి

‘కార్పొరేట్’ దోపిడీ..
కార్పొరేట్ స్కూళ్లు వచ్చి విద్యావిధానం ఘోరంగా దెబ్బతింది. గురువుల పట్ల గౌరవం క్షీణించింది. బోధకులను కించపరచడం, వారిపై దాడులు చేయడం మామూలైపోయింది. కేవలం ధనార్జన కోసం ఈ కార్పొరేట్ పాఠశాలలు వెలుస్తున్నాయి. చాలామంది తల్లిదండ్రులు గొప్ప కోసం వేలకువేలు ఖర్చుపెట్టి తమ పిల్లలను ఈ పాఠశాలల్లో చేరుస్తున్నారు. ఇది వేలం వెర్రిగా మారి కార్పొరేట్ విద్యాసంస్థలు వాడవాడలా వెలుస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలల్లో విద్య యాంత్రికం అయిపోయింది. కేవలం గ్రేడ్ల కోసం పోటీలు పడుతున్నారు. స్కూళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రజలను ఆకట్టుకొంటున్నారు. ప్రచారం శ్రుతి మించినందున ఈ ఫ్లెక్సీలు పూర్తిగా నిషేధించాలి.
- వి.సుందరి, విశాఖపట్నం

ఎపి రాజధాని ఏది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన దసరా నుండి వెలగపూడిలో ప్రారంభమైనట్లు, అన్ని శాఖల్లో అక్కడి నుండే పాలన మొదలుపెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ, ప్రభుత్వోద్యోగులకు జిపిఎఫ్, పింఛను, గ్రాట్యుటీ తదితరాలు మంజూరు చేసే అకౌంటెంట్ జనరల్ (ఎ.జి.) కార్యాలయం, పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ కార్యాలయాలన్నీ హైదరాబాద్‌లోనే ఇంకా పనిచేస్తున్నాయి. ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ పథకం కింద ప్రభుత్వోద్యోగులు ఇప్పటికీ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రినే ఆశ్రయిస్తున్నారు. రిటైర్డు ఉద్యోగులు, వైద్యసేవలు అవసరమయ్యేవారు హైదరాబాద్ వెళ్లవలసి రావటంతో అనేక వ్యయ ప్రయాసలు పడుతున్నారు. ఇంకా చాలా విషయాల్లో ఎపి రాజధాని రాజధాని హైదరాబాద్‌గానే చెలామణి అవుతుంది. కొన్ని పనులు వెలగపూడిలో, మరికొన్ని పనులు హైదరాబాద్‌లో జరగడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, రిటైరైన వారు రెండుచోట్లకు వెళ్లవలసి వస్తుంది. అన్ని రకాల సేవలూ వెలగపూడిలోనే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

గుంటూరును మరిచారా?
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా నామకరణం చేసి వెలగపూడి పరిసర ప్రాంతాలలో తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్నారు. ఐతే, గుంటూరు జిల్లా ప్రాంతాన్ని ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ విజయవాడ నుండి జరుగుతున్నట్లు గమనించవచ్చు. గుంటూరు నుండి ఏ కార్యక్రమాలు జరగడం లేదు. రాజధాని ప్రాంతాన్ని సీతానగరం నుండి గుంటూరు వరకూ విస్తరింపజేయాలి. గుంటూరులో కొన్ని ప్రభుత్వ శాఖలనైనా ప్రారంభించాలి.
- గర్నెపూడి వెంకట రత్నాకర్‌రావు, హనుమకొండ