ఉత్తరాయణం

పాఠ్యాంశంగా కళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేలా కళలను పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నట్టు ఎపి మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం స్వాగత పరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో కూచిపూడి, భరతనాట్యం ఉపాధ్యాయుల నియామకానికి వచ్చే డిఎస్‌సిలో ప్రకటన జారీ చేస్తున్నట్టు వెల్లడించడం సంతోషదాయకం.. అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయి. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో డిప్లమో, డిగ్రీ చేసిన అభ్యర్థులు కోకొల్లలుగా వున్నారు. వారిలో కనీసం కొంతమందికైనా ఉఫాధి కలుగుతుంది. ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోవాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు

పారిశుద్ధ్యం ఎక్కడ?
పట్టణాల్లోను, గ్రామాల్లోను పారిశుద్ధ్యం లోపం కనపడుతోంది. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. దోమలు, ఈగలు వ్యాపించి ప్రజలు వ్యాధులపాలవుతున్నారు. ప్లాస్టిక్ కవర్లుఈ చెత్తలో ఎక్కువై పర్యావరణాన్ని మరింత పాడుచేస్తున్నాయి. ఇండ్ల మధ్య ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కొందరు మూత్ర విసర్జన చేస్తున్నారు. పారిశుద్ధ్యతలో ఉత్తమ పట్టణాలుగా నిలిచి కొన్ని పట్టణాలు ఆదర్శంగా నిలస్తున్నాయి. ఇదే బాటలో మరిన్ని గ్రామాల , పట్టణ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవడానికి పూనుకోవాలి. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్య లోపానికి కారకులైన వారికి భారీగా జరిమానాలు విధించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

మెరుగుపడని ఆర్టీసీ
ఆర్టీసీ బస్సులకు సంబంధించి సమయపాలన, సౌకర్యాలు కొరవడినందున ప్రయాణీకులు నానా అవస్థలు పడుతున్నారు. ఉద్యోగినులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతుంటారు. అయితే, సమయానికి బస్సులు రానందున ప్రయాణీకుల్లో అసహనం పెరుగుతోంది. బస్‌పాస్‌ల రేట్లు, ప్రయాణ చార్జీలను పెంచుతున్నారే తప్ప ఆర్టీసీ అధికారులు ప్రయాణీకుల బాధలను పట్టించుకోవడం లేదు. తక్కువ మంది ప్రయాణించే ఎసి బస్సుల్లో సౌకర్యాలు పెంచుతున్నారే తప్ప సామాన్యుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రద్దీ సమయాల్లో బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణీకులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యమైన రూట్లలో, రద్దీ వేళల్లో బస్సుల సంఖ్యను పెంచాలి. ఎంతోమంది ప్రయాణీకులు ఆటోలు, ఇతర ప్రైవేటువాహనాలను ఆశ్రయించక తప్పడం లేదు. ప్రయాణీకుల అవసరాలను గుర్తించి సేవలను పెంచేందుకు ఇకనైనా ఆర్టీసీ అధికారులు దృష్టి సారించాలి.
- భాస్కర్, హైదరాబాద్

అర్చకులకు నిజమైన దీపావళి..
తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమ ట్రస్టుకు వంద కోట్ల రూపాయల నిధిని బదలాయించనున్నట్టు, హైదరాబాద్‌లో బ్రాహ్మణ సదనం నిర్మించనున్నట్టు సిఎం కెసిఆర్ ప్రకటించడం సంతోషకరం. అర్చకులు, ఆలయ సిబ్బంది సంక్షేమానికి కూడా కృషి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిరంతరం భగవంతుడి సేవలో ఉంటూ సమాజ సంక్షేమాన్ని ఆకాంక్షించే అర్చకులకు, ఆలయ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల వలే జీతభత్యాలు చెల్లించాలి. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం దీపావళిలోగా జీవో విడుదల చేస్తే అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీవితాల్లో నిజమైన కాంతులు విస్తరిస్తాయి. బ్రాహ్మణులు చేసేది సమాజ సేవ అని ప్రశంసించిన సిఎం కెసిఆర్ అర్చకులు, ఆలయ సిబ్బందికి దీపావళి కానుకను ప్రకటించాలి.
- చామర్తి వెంకట రామకృష్ణ, కాలిఫోర్నియా

ఎన్‌కౌంటర్ కాదు, ఇది యుద్ధమే..
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఈ నెల 24న జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణించారని అంతా అంటున్నారు. నిజానికి ఇది ఎన్‌కౌంటర్ కాదు.. దీన్ని యుద్ధం అనాలి. 1976 నుంచి పీపుల్స్‌వార్ గెరిల్లా దళ సభ్యులు ప్రభుత్వంపై పలుసార్లు యుద్ధాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఎపి-ఒడిశా పోలీసులకు, మావోయిస్టులకు యుద్ధం జరగడం ఇదే తొలిసారి కాదు, ఇదే చివరి సారి కాదు. పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని అంతం చేసి, తమదైన పాలన తెస్తామని మావోయిస్టులు దశాబ్దాల తరబడి చెబుతూనే ఉన్నారు. ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కుల గురించి మావోయిస్టులు ప్రకటనలు చేస్తుంటారు. పోలీసులకు సహకరిస్తున్నారనే నెపంతో ఇన్‌ఫార్మర్ల పేరిట కొందరిని వీరు హత్య చేస్తుంటారు. ఇన్‌ఫార్మర్ల విషయంలో మానవ హక్కుల సంగతి వీరికి పట్టదు. మావోయిస్టు సమస్యను పూర్తిగా నిర్మూలించనంత వరకూ ఈ యుద్ధం ఇలా సాగుతూనే ఉంటుంది.
- టి.హనుమాన్ చౌదరి, సికింద్రాబాద్