ఉత్తరాయణం

పల్లెల దశ తిరగదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం’ అనే మాటలు నినాదాలకే పరిమితమవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికీ అనేక గ్రామాలు, గిరిజన తండాలు ప్రగతికి నోచుకోవడం లేదు. అభివృద్ధి పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దండిగా నిధులు విడుదల చేస్తున్నా ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. చాలా గ్రామాల్లో ప్రజలకు నల్లాల ద్వారా తాగునీరు అందడం లేదు. కలుషిత జలాలే దిక్కు. అనేక పల్లెల్లో వీధిలైట్లు వెలుగవు. పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దోమలు, ఈగలు స్వైరవిహారం చేస్తూ ప్రజలకు వ్యాధులను కల్గిస్తున్నాయి. కుక్కలు, కోతుల బెడద విపరీతం. రహదారుల పరిస్థితి మరింత అధ్వానం. రోడ్లపై గోతులు పడి, చినుకు పడితే నడవలేని పరిస్థితి ఎదురవుతోంది. స్థానిక సంస్థల, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు చుట్టపు చూపుగా గ్రామాలకు వచ్చివెళ్తున్నారు. మంచినీరు లభించకపోయినా, పల్లెపల్లెలో మద్యం దుకాణాలను విరివిగా తెరిచారు. మందుబాబుల సంఖ్య పెరగడంతో గొడవలు, పోలీసు కేసులు నిత్యకృత్యంగా మారాయి. చాలా గ్రామాలకు సక్రమంగా రేషన్ సరకులు రావు. పాఠశాలల్లో వసతి సమస్య, టీచర్ల కొరత షరామామూలే. పల్లెల్లో ఇలా సమస్యలు తిష్టవేసినపుడు ‘బంగారు తెలంగాణ’ ఎలా సాధ్యం?
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట

ఒసిలకు గుర్తింపు ఏదీ?
రిజర్వేషన్లు వర్తించని కులాలన్నింటినీ ‘ఇతర కులాలు’ (ఓ.సి.లు) అని అంటున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు విద్య, ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ‘ఇతర కులాల’ (ఒసి) కేటగిరీలో ఉన్న కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, తెలగ, క్షత్రియ, బలిజ, వైశ్య వంటి కులస్థులకు ఎలాంటి ‘గుర్తింపు’ లేకుండాపోయింది. ప్రభుత్వం కూడా వీరిని ‘ఇతర కులాల’ (ఒసిలు) కిందనే జమ కడుతోంది తప్ప- ‘అభివృద్ధి చెందిన’ లేదా ‘అగ్రవర్ణాలు’ అని ఎక్కడా అనడం లేదు. అయితే, మిగతా కులాలవారు మాత్రం వీరిని ‘అగ్రవర్ణాలు’ అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘అగ్రకుల దురహంకారం, అగ్రకుల దౌర్జన్యాలు, అగ్రకుల భావజాలం’ అంటూ వీరిపై మిగతా కులాల వారు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ దేశంలో ఒసిలు, బిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు అందరూ హిందువులే. హిందువులంతా ఐక్యతతో ఉండటం ఒక చారిత్రక అవసరం అయిన ప్రస్తుత తరుణంలో కులాలు, వర్గాలుగా ద్వేషించుకుంటూ, దూషించుకుంటూ ఉండటం ఏ విధంగా సమంజసం! ఇంకోవైపు పాలకులే ‘మైనారిటీలం’టూ మరికొన్ని వర్గాలను విడదీసి చూస్తున్నారు. వేరే దేశాలలో మైనారిటీలకు రక్షణ అంటూ ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయా? కులవ్యవస్థను ‘మనువు’ ఏర్పరిచాడని కొంతమంది నిందిస్తారు. కానీ, నేటి రాజకీయాల్లో ‘అభినవ మనువులు’ కులవ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తున్నారు. ‘అగ్రవర్ణాల’ వారికి కూడా ఆర్థిక సహాయ సంస్థలు, భవనాలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ నేటి పాలకులు ప్రజలను మరింతగా విడదీస్తున్నారు. అన్ని కులాల వారికీ తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను దిక్కుమాలిన స్థితిలోకి నెడుతున్నారు.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్

లైబ్రరీకి వసతి సమస్య
కర్నూలు జిల్లా మైదుకూరులోని గ్రంథాలయానికి సరైన వసతి లేనందున పాఠకులు నానా అవస్థలు పడుతున్నారు. పురాతనమైన ఈ లైబ్రరీకి నిత్యం విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు వస్తుంటారు. సిబ్బంది సరిగా విధులకు హాజరు కానందున గతంలో ఈ గ్రంథాలయం కొన్నాళ్లు మూతపడింది. ప్రస్తుతం ఒక పురాతన శిథిల భవనంలో లైబ్రరీ నడుస్తోంది. భవనం ఏ క్షణాన కుప్పకూలుతుందోనన్న భయాందోళనలతో పాఠకులు లైబ్రరీకి రావాలంటేనే హడలిపోతున్నారు. భవనం అంతా బీటలు వారినందున వర్షం కురిస్తే పుస్తకాలన్నీ తడిసిపోతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ లైబ్రరీకి స్థలం కేటాయించి సొంత భవనం నిర్మించాలి.
-ఎవి సుబ్బన్న, మైదుకూరు