ఉత్తరాయణం

తలాక్‌పై చర్చ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిం సమాజపు అంతర్గత సమస్యగా చెప్పబడుతున్న ‘తలాక్’ అంశం రద్దుపైన విస్తృత చర్చ అవసరం. మానవత్వ కోణంలో చూస్తే స్ర్తి స్వేచ్ఛకు ‘తలాక్’అనేది భంగకరం. మారుతున్న కాల పరిస్థితులకు అనుకూలంగా మత ఆచారాలు, గ్రంథాలలో వ్యాఖ్యానాలు కూడా మార్చుకోవలసిన అవసరం ఉంది. ముస్లిం మత పెద్దలు, మేధావులు, సామాజికవేత్తలు తలాక్ అంశాన్ని సమీక్షించాలి. స్ర్తివాదులు అని చెప్పుకునే వారంతా ముస్లిం స్ర్తిల బురఖా, తలాక్ అంశాలపైనా ఎందుకు మాట్లాడరో అర్ధంకావట్లేదు. పైటను తగిలేయాలి అని కవిత్వం రాసేవాళ్లంతా ఎక్కడున్నారో తెలియట్లేదు. అంతర్జాతీయ ఇస్లాం సమాజంలో ఒక భాగమైన ముస్లింలంతా భారతీయ ముస్లింలుగా ఆలోచించాల్సిన తరుణమిది. ఇస్లాం కూడా భారతీయకరణ జరగాలి.
- సామల కిరణ్, జూలపల్లి

యువత పయనమెటు?
నేటి యువతలో నేరప్రవృత్తి పెరిగిపోతోంది. కొంతమంది పెడద్రోవ పట్టడం శోచనీయం. స్ర్తిల పట్ల వేధింపులు, దౌర్జన్యాలు, మొబైల్స్‌వంటి వాటిని దొంగిలించడం, చైన్ స్నాచింగ్‌లు, సైకో ప్రవృత్తి, హింసాకాండ, మద్యపానం తదితర లక్షణాలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రుల బాధ్యతా రాహిత్యం, చెడు సావాసాలు, పరిసరాలు, పాఠశాలల్లో, కళాశాలల్లో నైతిక విద్య శూన్యమవడం, టీవీలు, సినిమాలు, అంతర్జాలం తదితరములు యువతపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. పాఠశాల, కళాశాల దశలోనే తప్పనిసరిగా నైతిక విద్యను బోధించాలి. ఆయా యాజమాన్యాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషిచేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల చిన్నప్పటినుండే బాధ్యత తీసుకోవాలి. వారిని మంచివారుగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా ప్రయత్నించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

పెద్దనోట్ల రద్దు మంచిదే
పెద్ద నోట్ల రద్దువల్ల నష్టపోయేది సామాన్య ప్రజలు ఎంతమాత్రము కానేకాదు. పెద్ద నోట్ల రద్దువల్ల రాజకీయవేత్తలు, నల్లకుబేరులు, అక్రమంగా కూడబెట్టిన వాళ్లు, ఉగ్రవాదులకు, మావోయిస్టులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఓట్లకోసం డబ్బు సంచులు దించే పరిస్థితి దేశంలో పోవాలి. కోట్లాది నల్లడబ్బు నల్లదైపోయింది. సామాన్య ప్రజలు ఇబ్బంది పడేదేమీ లేదు. ఇప్పుడు పడే ఇబ్బందులన్నీ తాత్కాలికమే! పెద్ద నోట్లను రద్దుచేసినందువల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ముద్రించే భారతదేశ కరెన్సీ పనికి రానిదైంది. పెద్ద నోట్ల రద్దువల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పెట్టవచ్చు. ప్రజలు బాగా ఆలోచించాలి. సామాన్యుడు ఏమాత్రం బాధపడాల్సిన పని లేదు. కోట్లాది డబ్బును గోనే సంచుల్లో దాచుకున్న వ్యక్తులే ఈ నిర్ణయంవల్ల బాధపడాల్సిందే! ఇప్పుడు అల్లరిచేసే వాళ్లు, బాధపడేవాళ్లు నల్ల డబ్బు బాధితులే! దీన్ని కూడ రాజకీయం చేయటం అవివేకమేగదా! ఇప్పుడు కూడ ముద్రించిన రు.2,000/- నోటు కూడ రద్దుచేసి, కేవలం రూ.500/- ల నోట్లవరకే పరిమితం చేస్తే దేశానికి మంచిది.
- జి.శ్రీనివాసులు, అనంతపురం

సామాన్యుడికే తిప్పలు
ప్రధాని మోదీ నల్లధనాన్ని అరికట్టడానికై 500, 1000 రూపాయల నోట్లని రద్దుచేశారు. విదేశాలలో దాచుకున్న, పేరుకుపోయిన దాన్ని నల్లధనమన్నారు. దాన్ని వెలికితీస్తామని గత ప్రభుత్వాలు ఘోషించాయి. కాని చేసింది సున్నా.. మోదీ మాత్రం ధైర్యంచేసి రెండు పెద్దనోట్లను రాత్రికిరాత్రే రద్దుచేశారు. అందరూ భేష్ భేష్ అన్నారు. పూర్వం 10వేలు నోట్లుండేవి. అవి రద్దుచేయబడ్డాయి. అయినా నల్లధనం ఆగలేదు. పేరుకుపోయింది. మోదీ పెద్దనోట్ల రద్దువల్ల విదేశాల్లో పేరుకుపోయిన నల్లధనం సంగతి దేముడెరుగు కాని సామాన్యుడు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఎటిఎమ్, బ్యాంక్, పోస్ట్ఫాసులు, జి.జి.హెచ్‌లు దగ్గర సామాన్యులు ఇబ్బందిపడి పోతున్నారు. 2016 డిసెంబర్ 30దాకా పాత నోట్లు మార్చుకునే అవకాశమున్నప్పటికీ సామాన్యుడి బాధ సామాన్యుడిదే. అసలు విదేశాల్లో మూలుగుతూనే వుంది. దానికి పరిష్కారం చూపకుండా కొత్త నోట్లని తీసుకురావడం ఎంత సమంజసం.
- కె.వి.రమణమూర్తి, కాకినాడ