జాతీయ వార్తలు

ఉట్టి కొట్టాలంటే 18 ఏళ్లు నిండాలి: సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: 18 ఏళ్లు దాటితేనే దహీ హండీ (ఉట్టి కొట్టే కార్యక్రమం)లో పాల్గొనాలని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 18 ఏళ్ల లోపు పిల్లలు దహీహండీలో పాల్గొనరాదని, ఒకరిపై ఒకరు ఎక్కే పిరమిడ్‌ ఎత్తు కూడా 20 అడుగులకు మించరాదని 2014లో బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. బాంబే హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థిస్తూ 18ఏళ్లు దాటితేనే దహీహండీలో పాల్గొనాలని, . పిరమిడ్‌ ఎత్తు 20 అడుగులు మాత్రమే ఉండాలని తీర్పునిచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జన్మాష్టమి సందర్భంగా మహారాష్ట్రలో దహీ హండీ వేడుకలు పెద్దఎత్తున నిర్వహిస్తారు. ఒకరిపై ఒకరు ఎక్కి మానవ పిరమిడ్‌లా ఏర్పడి, వేలాడుతున్న పెరుగు కుండను కొట్టడమే ఈ ఆట ప్రత్యేకత. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్వాతి పటేల్‌ అనే సామాజిక కార్యకర్త పిటిషన్‌ దాఖలు చేశారు.