క్రీడాభూమి

వాలీబాల్ ఫెడరేషన్ కప్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 11: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 31వ ఫెడరేషన్ కప్ వాలీబాల్ ఛాంపియన్ షిప్-2018 ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 18వ తేదీ వరకు ఈ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహిస్తారు. పౌరసరఫరాలశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ పోటీలను ప్రారంభించారు. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలోని పశ్చిమ గోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఛాంపియన్‌షిప్-2018 పోటీలను నిర్వహిస్తోంది. వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రభుత్వ విప్ పిజివిఆర్ నాయుడు (గణబాబు), నరసాపురం ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, వేటుకూరి వెంకట శివరామరాజు, ఎమ్మెల్సీ ఎంవి సత్యనారాయణరాజు (పాందువ్వశ్రీను), క్లబ్ అధ్యక్షులు గోకరాజు రామరాజు, ఫెడరేషన్ కప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం వంటి కేంద్రంలో జాతీయస్థాయి వాలీబాల్ ఫెడరేషన్ కప్ పోటీలు నిర్వహించడం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు. ఈ స్థాయి పోటీలను కొనే్నళ్లుగా కాస్మోపాటికన్ క్లబ్ నిర్వహించడం విశేషమన్నారు. ప్రభుత్వం కూడా ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తోందని మంత్రి పేర్కొన్నారు. తొలి రోజు పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్-హర్యానా, సర్వీసెస్-ఇండియన్ యూనివర్సిటీస్ మధ్య పోటీలు నిర్వహిస్తారు. ఇక మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్-కేరళ, మహారాష్ట్ర-తమిళనాడు మధ్య రాత్రి వరకు పోటీలు నిర్వహించారు.