హైదరాబాద్

విద్యార్థులకు క్రీడలకు సమయాన్ని కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: విద్యార్థులకు చదువుతో పాటు ఆట, పాటలకు కూడా ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించినప్పుడే వివిధ రంగాల్లో వారి ప్రతిభను వెలుగులోకి తేగలమని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. శుక్రవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో రెండురోజులు నిర్వహించే రంగారెడ్డి జిల్లా స్థాయి కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల క్రీడాపోటీలను జేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఎదగాలంటే ఆట, పాటలలో వారి ప్రావిణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
ఉపాధ్యాయులు చెప్పిన విధంగా విద్యార్థులు నడుచుకున్నప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఆమె తెలిపారు. విద్యార్థుల్లో దేహదారుఢ్యాన్ని పెంపొందించుటకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచేందుకు ప్రతిరోజూ కనీసం గంటన్నర సమయాన్ని కేటాయించాలని ఆమె సూచించారు. కస్తూరిబా విద్యాలయాల ప్రత్యేకతను చాటిచెప్పే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని అదేవిధంగా ఇక్కడ విధ్యనభ్యసించే పిల్లలను సొంత పిల్లలుగా చూసుకుంటూ వారిలో మంచి ప్రవర్తనను కలిగించేలా కృషి చేయాలని తెలిపారు.
జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ మాట్లాడుతూ కస్తూరిబా విద్యాలయాల్లో జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని క్రీడలు నిర్వహించాలని ఆదేశించారని, ఎప్పుడూలేని రీతిలో రెండు రోజుల పాటు ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్, ఖోఖో క్రీడలను జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి లాంఛనంగా ప్రారంభించారు.