వాసిలి వాకిలి

రవి శనులు రాజయోగులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యుడు అన్న వెంటనే మన కళ్ల ముందుకొచ్చేది సౌర కుటుంబం. భగభగ మండే అగ్ని గోళం మన ముందు కదలాడుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, సూర్యగ్రహణాలు మన ముందు నిలుస్తాయి. ప్రాతః సంధ్యన భానోదయ రేఖలు, సాయం సంధ్యన ఆకాశం నుండి భూమిలోకి జారిపోతున్న కెంజాయ రంగు సూర్యగోళం నేత్రానందంగా కనుపాపలలో మెదలుతుంది. మధ్యాహ్నాన మంటలు పుట్టించిన సూర్యుడు సాయంత్రానికి తన వెలుగును ఉపసంహరించుకుంటూ చీకటిని భూమి మీదకు విసరటం ఒక మనోహర చిత్రం. ఆ చీకటిని చీల్చుకుంటూ చంద్రోదయం. చంద్రహాసంతో చల్లబడ్డ మన భూగోళం ఎంతో అందమైన రాత్రిని ఆవిష్కరిస్తుంది.
అన్నట్టు మనం దినమంతా మంచి వెలుగులో ఉండటానికి కారణం సూర్యుడు నుండి వచ్చే ఇంధన వాయువులు అంటే గాసెస్. సూర్యగోళానికున్న గురుత్వాకర్షణ శక్తి వల్ల సౌర కుటుంబంలోని పెద్ద గ్రహాల నుండి చిన్న గ్రహాలు, తదితర ఖగోళ సంబంధితాలు సూర్యుని కక్ష్యలోనే ఉండగలుగుతున్నాయి. సూర్యగోళంలోని విద్యుచ్ఛక్తి వల్ల అయస్కాంత క్షేత్రం ఏర్పడి ఆ విద్యుచ్ఛక్తి సౌరగాలుల ద్వారా మొత్తం సౌర కుటుంబానికి వ్యాపిస్తుంది. ఆ విద్యుత్ ఇంధన వాయువుగా సూర్యగోళం నుండి బయటికి వ్యాపిస్తుంది. మనం చూసే సూర్యుడు 92.1 శాతం హైడ్రోజన్, 7.8 శాతం హీలియంల సమ్మేళనం.
సౌరశక్తితోనే జీవజాల మనుగడ
మనకు సూర్యుడు ఒక వింత గొలిపే గ్రహంగా అనిపిస్తున్నప్పటికీ సూర్యుడి వంటి గోళాలు పాలపుంతలో అనేకం ఉన్నాయి. నిజానికి సౌరశక్తి లేకపోతే భూమిపైన మానవ మనుగడ, ప్రాణికోటి మనుగడ సాధ్యమయ్యేది కాదు. ఈ సూర్యగోళం నిండా లక్షల గ్రహాలు, తోకచుక్కలు, మరెన్నో ఖగోళ సంబంధితాలు. మన భూమి లాంటి పదమూడు లక్షల భూముల ఘనపరిమాణాలు కలిస్తే ఎంత ఘన పరిమాణం అవుతుందో సూర్యుడి ఘనపరిమాణం అంతది. ఇక సూర్యుడి వ్యాసార్థం 6,95,508 కిలోమీటర్లు. సూర్యుడు మన భూమికి పదిహేను వందల యాభై లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సౌరకుటుంబం గంటకు 7,20,000 కిలోమీటర్ల వేగంతో చలనశీలమవుతోంది. సూర్యగోళం సైతం వాటి ప్రభావాలతోనే తమ పరిణామాన్ని సాగిస్తున్నాయి. సూర్యగోళం ఉష్ణోగ్రత పదివేల డిగ్రీల ఫారిన్ హీట్. సూర్యుడి నుండి బయలుదేరిన కిరణం భూమిని చేరటానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది.
సూర్యుడు అంటే సౌరకుటుంబ అధిపతి. సౌరకుటుంబంలోని గ్రహాలకు, ముఖ్యంగా మనం చెప్పుకునే ఎనిమిది గ్రహాలకు నాయకుడు సూర్యుడే. ఈ గ్రహాలన్నీ సూర్యశక్తి ఆధారంగానే వర్ధిల్లుతున్నాయి. సూర్యుడు లేకపోతే ఈ గ్రహాలకు మనుగడే లేదు. అందుకే సూర్యుడ్ని మనం నాయకత్వానికి, అధికారానికి ప్రతీకగా చెప్పుకుంటున్నాం. ఇక భూమి మీద మన మానవ మనుగడ సాధ్యమవుతోందంటే సూర్యుడి వల్లనే. మనం అనేకాదు. మన చుట్టూ పరచుకున్న ప్రకృతి అంటే చెట్టూ చేమా జంతుజాలం, జలచరాలు, పక్షి సంతతి... అన్నింటి మనుగడ సౌరశక్తిపైనే ఆధారపడి ఉంది. మారే రుతువులు, రంగులు మారే పచ్చదనం అంతా సూర్య మహిమాన్వితమే. కాబట్టే మానవ జగతి సూర్యుడ్ని భగవంతుడిగా పరిగణించి ఆరాధిస్తోంది. చివరికి మకర సంక్రాంతి, రథసప్తమి వంటి పండగలను సైతం జరుపుకుంటోంది.
సూర్యుడు గ్రహమే
ఈనాటి విజ్ఞానశాస్త్రం సూర్యుడ్ని ఒక గ్రహంగా పరిగణించకపోయినప్పటికీ జ్యోతిషశాస్త్రం మాత్రం సూర్యుడ్ని గ్రహంగానే పరిగణిస్తోంది. కారణం మనపై ప్రభావం చూపుతున్న ఖగోళ సంపదను గ్రహాలుగానే పరిగణిస్తున్నాం కాబట్టి, సూర్యుడ్ని జ్యోతిషపరంగా రవి అంటుంటాం.
జ్యోతిషశాస్త్ర ప్రకారం జాతకచక్రంలో రవి స్థానాన్ని బట్టి ఒక వ్యక్తి జీవన విధానాన్ని అంచనా వేయవచ్చు. ఒక విధంగా రవిక్షేత్రం మన ఆత్మ క్షేత్రం. అంటే మనల్ని మనంగా చూపించేవాడు రవి. ఆత్మవిశ్వాస ప్రతీక కూడా. మన ఎనర్జెటింగ్ లెవెల్స్ రవి బలంపైనే ఆధారపడి ఉంటాయి. మన ఉత్సాహాన్ని, మన జీవన విధానంలోకి వేగాన్ని బట్టి రవి బలాన్ని అంచనా వేయవచ్చు. ఇక యోగసాధకులకు రవి ఎంతో ముఖ్యుడు. మన సంకల్ప సిద్ధికి మార్గం చూపేవాడు సూర్యుడే. పైగా మనలోని సృజనాత్మకతకు ముఖ్య భూమిక రవినే.
రవిలా మనమూ ప్రభావం చూపాలి
ఖగోళ సామ్రాజ్యాధినేత సూర్యుడు. సూర్యుడు కేంద్రంలో ఉంటే తక్కిన గ్రహాలు, తదితరాలు సూర్యుని చుట్టూ ఉంటాయి. ఖగోళంలో సూర్యుడి ప్రభావం ఎలా ఖగోళ మండలంపై ఉంటుందో అలాగే రవి బలం వల్ల మనం కూడా మన సమాజంపై ప్రభావం చూపాలి. ఆదరించటం, ఐకమత్యంగా మెలగటం అనేవి మనకు భూషణాలు కావాలి. సూర్యుడి తత్వం వెలుగుపరచటమే తప్ప దాచటం కాదు. కాబట్టి మనం కూడా తెరచిన పుస్తకంలా ఉండాలి. సునిశిత దృష్టి, నిజాయితీ మనల్ని వ్యక్తిత్వసంపన్నుల్ని చేయాలి. అప్పుడు సూర్యుడు తెలీనివారు ఏ ఒక్కరూ ఉండరన్నట్లే మనమూ అందరి నాల్కలపై ఉంటాము. అన్నట్టు, అన్నిటి కంటే ముఖ్యం మనం మన సమాజం మాటలు వింటున్నట్లున్నా, నిజానికి ఆచరణలో పెట్టవలసింది మన అంతర్వాణిని. అంటే, ఎల్లప్పుడూ మనం మనలో మాటలకే విలువనివ్వాలి. అప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్నయినా సునాయాసంగా ఎదుర్కోగలం.
సూర్యుడు మార్గదర్శి, వ్యక్తిత్వాన్ని పెంచేవాడు, భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు. అహాన్ని పెంచేవాడు. ఆథ్యాత్మికతను పెంచేవాడు కూడా రవినే. దేన్నయనా ఎదుర్కో గల ధైర్యాన్ని, శక్తిని ఇచ్చేది కూడా సూర్యుడే.
రవి మనకు మార్గదర్శి
మన జీవితాలకు వెలుగునిచ్చేది రవి. మన జీవితాలపై కాంతిని ప్రసరింపచేసేది రవి. మన ప్రతిభాపాటవాలు, కీర్తిప్రతిష్టలు, అదృష్టాలు, గుర్తింపులు... ఇవన్నీ రవి మన విషయంలో బలంగా ఉండటం వల్లనే సాధ్యం. మన అందచందాలు, తెలివితేటలు కూడా రవి అనుకూలత వల్లనే. సత్యజీవనం సాగించాలనుకోవటమూ రవి కారణంగానే, కళలలోను, సంగీత సాహిత్యాలలోను రాణించటమూ రవి మనకు అనుకూలుడు కావటం వల్లనే. మనం ఉన్నతంగా ఆలోచించటానికి, మన ఉన్నతాశయాలకు ముఖ్య భూమిక రవినే. రవి అంటే మన ఆత్మకు, మన తండ్రికి ప్రతినిధి. మన పరిపూర్ణత్వానికి మూలకారకుడు రవి.
సూర్య శనుల కలయిక
సామాన్యంగా మనమందరం జ్యోతిష శాస్త్రాన్ని, హస్త సాముద్రికాన్ని నమ్ముతుంటాం. రేపు అంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందో అన్నదానిపైన ప్రతి ఒక్కరికి ఆసక్తే. అందుకు మన జాతక చక్రాలపై ఆధారపడతాం. జాతకచక్రం అంటే గ్రహాల బలాలు, గ్రహాల కలయికలే. ఒక గ్రహం మరొక గ్రహంతో కలిస్తే ఏమవుతుందో చెప్పేవే ఈ శాస్త్రాలు. మనం మనకిష్టమైన స్నేహితుడితో కలిస్తేనే ఎంతో సంతోషంగా ఉంటాం. అంతగా ఇష్టం లేని స్నేహితుడితో కలిస్తే అంత సన్నిహితంగా ఉండం. అలాగే మన గ్రూప్‌లో లేని ఇతరులతో కలిసినప్పుడు మన ప్రవర్తన ఒకలా ఉంటుంది. ఇటువంటిదే గ్రహాల పొత్తులు కూడా. రెండు హిత గ్రహాల మధ్య బాగా సాన్నిహిత్యం పెరిగితే మన జీవితంపై ఫలితాలు హితంగానే ఉంటాయి. ఈ విశ్వంలో అన్నీ హిత గ్రహాలే అయినప్పటికీ ప్రభావాలు సాన్నిహిత్యాన్ని బట్టి ఉంటుంటాయి. ఉదాహరణకి సూర్యుడు అంటే రవి శని గ్రహాలూ కలిస్తే సానుకూలత ఉండదని సామాన్య జనుల భావన.
సూర్య శనుల సఖ్యత
అసలు సూర్య శనుల కలయిక అంటే రవి శనులు ఒకే ఇంటిలో ఉండటం. కారణం ఈ రెండు గ్రహాలను విరోధులుగా పరిగణించటమే. నిజానికి ఇద్దరి తత్వాలు వేరు. ఇద్దరి జీవన శైలి వేరు వేరు. అయినప్పటికీ సూర్యుడు తండ్రి, శని తనయుడు. ఈ తండ్రీ తనయుల జీవనతీరు వేరైనప్పటికీ బంధం కాదనరానిది కదా. అసలు ఇటువంటి విరుద్ధ తత్వాల ఇద్దరు కలిసే కొంతకాలం ఉన్నా ఇద్దరి మధ్యా సహనం, సంయమనం ఎంతో ఉంటుంది. అవసరానికైనా ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరి మాటను మరొకరు తలకెత్తుకోవటం జరుగుతుంది. ఇటువంటప్పుడు వీరిద్దరూ కలిసి సాధించలేనిదంటూ ఉండదు. ఈ తత్వం అర్థం చేసుకోలేక చాలా మంది జ్యోతిష్కులు రవి శనులు ఒకే ఇంట ఉండటాన్ని తప్పుగా పరిగణిస్తుంటారు. జరగరానిది జరుగబోతున్నట్లు భయపెట్టిస్తుంటారు.
అయితే ప్రఖ్యాతులైన వారి కీర్తి ప్రతిష్టల నార్జించిన వారి జాతకాలను పరిశీలిస్తే వారి ఉన్నతికి రవి, శని గ్రహాల సఖ్యతే మూలకారణంగా కనిపిస్తుంది.
అన్నట్టు, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా సూర్య శని గ్రహాలు తండ్రీ తనయులు. పైగా ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతి మాసాన సూర్యుడు శని ఇంటికి వెళ్లి ఒక నెల శనితో అంటే కొడుకుతో కలిసి ఉంటాడు. ఈ నెలలో పుట్టిన వారు రవి, శని గ్రహాల కలయితో ఉంటారు.
సూర్య శనుల తత్వాలు
సూర్యుడు అంటే సౌరకుటుంబ పెద్ద. అన్ని గ్రహాలకు నాయకుడు. బల సంపన్నుడు, శక్తి సంపన్నుడు. సౌరకుటుంబ గ్రహంగా చూస్తే అత్యోష్ణగ్రాహం. ఈ గ్రహానికి కొన్ని వేల, లక్షల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ ఇతరాలు మాడి మసి అయిపోవాల్సిందే. ఇంకా చెప్పుకోవాలంటే రవి అహంకారి కూడా. రాజసం ఎక్కువ. అధినేత. మన ఆత్మను ప్రతిబింబించేది కూడా సూర్యుడే. పైగా అతి వేగంగా కదిలేవాడు. అయితే సూర్యుడి వర్తనానికి పూర్తి వ్యతిరేకం శని వర్తనం. శని చాలా నెమ్మదస్తుడు. ఆచితూచి అడుగులు వేసేవాడు. క్రమశిక్షణకు మారు పేరు. శిక్షిస్తూనే శిక్షణనిచ్చే ఉపాధ్యాయుడు. స్థిర సంకల్పుడు. శని కర్మజీవి. కార్మిక నేస్తం. ఎప్పుడూ కార్మికుల, శ్రామికుల వెంట ఉండేవాడు. అయితే రవి అధికారుల వెంట ఉండే వాడు. అధికారం చెలాయించేవాడు. హోదా, కీర్తిని ఆశించేవాడు. ఆత్మకు అధిక ప్రాముఖ్యమిచ్చేవాడు. అంటే ఆత్మనే సర్వస్వంగా పరిగణించేవాడు. ఈ ఆత్మతత్వం సూర్యుడి సొంతం కూడా. అందుకే ఈ ఇద్దరి కలయిక కొందరికి ఎంతో రాణిస్తుంది.
ఇద్దరూ ఆత్మకు పెద్దపీట వేసేవారే
సూర్యుడు పరుగులు పెడుతుంటే శని అడుగులో అడుగు వేసి నడుస్తుంటాడు. అయినా ఇద్దరూ తమ ఆత్మ చెప్పినట్టు నడుచుకునేవారే. కాబట్టి ఆత్మకు ప్రథమ తాంబూలం మిచ్చే ఆథ్యాత్మికులకు, యోగులకు సూర్య శనులు ఎంతో అనుకూల గ్రహాలు. భౌతికంగా ఉంటూనే అధిభౌతిక ద్వారాలు తెరిచేవారు సూర్య శనులు. అధిభౌతిక సంపన్నులైన ఆథ్యాత్మికులు. యోగులు విశ్వ రహస్యాలను, సృష్టి రహాస్యాలను తెలుసుకోగలగటంలో ఈ రెండు గ్రహాల పాత్ర ఎంతో ఉంది.
సూర్యుడు అంటేనే మన జవజీవాలు. మన చైతన్యానికి మూలవాహిని. మనల్ని ఎల్లప్పుడూ ఆత్మ స్పృహతో ఉంచేవాడు. యోగసాధన అంతా చైతన్య విలసనమే కాబట్టి రవితేజమే సాధకులకు ‘ఆరా’ అవుతుంది. మనలోని అహాన్ని అతి సున్నితంగా రక్షిస్తూ వచ్చేది కూడా సూర్యుడే. మనకు కీర్తిప్రతిష్టలు అందిస్తూనే మితిమీరిన అహంకారంతో జారిపోకుండా చూసుకునేది కూడా రవినే. ఒక విధంగా ఇలా రవి మన అంతరాత్మగా వ్యవహరిస్తుంటాడు.
రవి ఎంతలా రహస్యాలపై వెలుగుపరుస్తుంటాడో శని అంతలా గోప్యంగా ఉంచటానికే ప్రయత్నిస్తుంటాడు. అంటే ప్రయత్నించనిదే ఫలితం అందదన్నది శని సిద్ధాంతం. కాబట్టి కంటి ముందుకొచ్చింది చూడటం శని తత్వం కాదు. ఎక్కడో ఉన్నదాని కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుని, కష్టించి, కళ్ల ముందుకు తెచ్చుకోవాలన్నది శని తత్వం. అందుకే నిత్య యోగసాధకులకు సానుకూలుడు శని. పైగా శని ఏకాంతవాసి... సాధకులూ ఇంతే. ఏకాంతాన్ని కోరుకుంటుంటారు.

-విశ్వర్షి 93939 33946