అనంతపురం

ఆగని వలసలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆదుకోని ‘ఉపాధి’
* కుటుంబ సగటు పనిదినాలు 61.06
* వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాలు 41.854
అనంతపురం, డిసెంబర్ 11 : వలసలు ఆపాలని ఉపాధి హామీ పథకంలో పనిదినాలు పెంచిన జిల్లాలో వలసలు మాత్రం ఆగలేదు. అటు నాయకులు, ఇటు అధికారులు వలసలు వెళ్లవద్దని ఎంత చెబుతున్నా జిల్లాలో నెలకొన్న వరుస కరవుతో రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం పట్టణాలు, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్యే ఇందుకు నిదర్శనం. వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయి. జిల్లాలో ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 7,75,112 మందికి జాబ్‌కార్డులు మంజూరు చేశారు. ఈ కార్డుల్లో 2,54,742 కుటుంబాల నుంచి 1,84,1130 మంది కూలీలు నమోదు చేసుకున్నారు. పెద్దసంఖ్యలో జాబ్‌కార్డులు జారీ చేసినా, కూలీలుగా నమోదు చేసుకున్నా వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు మాత్రం అతి తక్కువగానే ఉన్నాయి. జాబ్‌కార్డుల్లోని కూలీలకు మొత్తం 11,55,54,158 పని దినాలను కల్పించారు. సగటున 61.06 దినాలు మాత్రమే ఉపాధి కల్పించారు. ఇందులోనూ వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు 41,854 మాత్రమే ఉండడం గమనార్హం. యాభై రోజుల కన్నా తక్కువ పని దినాలు కల్పించిన మండలాలను పరిశీలిస్తే .. బెళుగుప్ప (మండలాల్లో) సగటున 49.46 (పనిదినాలు), గుంతకల్లులో 46.11, హిందూపురంలో 48.27, కణేకల్లులో 45.34, మడకశిరలో 48.93, ముదిగుబ్బలో 49.57, రొద్దంలో 47.22, యాడికిలో 40.44 రోజులు పని కల్పించారు. వీటితోపాటు వజ్రకరూరు, ఉరవకొండ, తాడిమర్రి, శెట్టూరు, పుట్టపర్తి, పెద్దవడుగూరు, ఓడిసి, పెద్దపప్పూరు, పరిగి, పామిడి, అనంతపురం, బత్తలపల్లి, బొమ్మనహాళ్, బ్రహ్మసముద్రం, బుక్కపట్నం, బుక్కరాయసముద్రం, సికె పల్లి, చిలమత్తూరు, గార్లదినె్న, గుమ్మగట్ట, గుత్తి, గోరంట్ల, గుడిబండ, కొత్తచెరువు, కూడేరు, కుందుర్పి మండలాల్లో సగటును 50 నుంచి 60 రోజుల వరకూ ఉపాధి కల్పించారు. ఎనిమిది మండలాల్లో సగటున 50 కన్నా తక్కువ పని దినాలు కల్పించగా, మరో 26 మండలాల్లో సగటున 50 నుంచి 60 రోజుల మధ్య పని దినాలను కల్పించారు. ఇలా జిల్లాలోని 34 మండలాల్లో సగటున 60 రోజుల కన్నా తక్కువ పని దినాలను కల్పించడం గమనార్హం. అధికారులు, ప్రభుత్వ వర్గాలు, అధికార పార్టీ నాయకులు వంద రోజులకు పైబడి పనిదినాలు కల్పించామని ప్రకటిస్తున్నా వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్య అతి తక్కువగానే ఉంది. ఉపాధి హామీ పథకానికి వెళ్లడానికి కూలీలు వెనుకంజ వేస్తున్నారా? లేక ఆ శాఖ అధికారులు పని కల్పించకపోతున్నారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.