జాతీయ వార్తలు

వాయుగుండం తుపానుగా మారే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రతరమై రాబోయే 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం ఉదయం సమయానికి వాయుగుండం చెన్నైకి తూర్పుదిశగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం చెన్నై నుంచి ఉత్తర దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తోంది. ఈదురుగాలులతో వర్షం కురియడంతో చెన్నైలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ సంఖ్యలో చెట్లు విరిగిపోయాయి. తమిళనాడు కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నం, రామేశ్వరం, పుదుచ్చేరి ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. గత డిసెంబర్‌లో జరిగిన వరద నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించేందుకు, అవసరమైన చోట కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.