ఈ వారం తార

-రకుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందానికే కాదు, అదృష్టానికీ ఐదున్నర అడుగుల రూపం ఎవరూ? అంటే -రకుల్ పేరే చెబుతున్నారు పరిశ్రమలో. పట్టుమని పది సినిమాలు చేయలేదు. మెగా క్యాంపు హీరోలతో తప్ప, మిగతా స్టార్ హీరోలతో పెద్దగా జోడీ కట్టలేదు. ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ సినిమాలూ లేవు. కానీ -క్రేజ్ మాత్రం బోలెడంత. రెమ్యూనరేషన్ రేటూ అలాగే పలుకుతోంది. ఆమెతోపాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయన్లంతా ఇంకా ప్యాసింజర్ ప్రయాణాలు చేస్తుంటే -రకుల్ మాత్రం మొదట్లో ఎక్కిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లాగే పరుగులు తీస్తుంది. అందుకే అంటారు, ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలన్నా.. కిక్ ఇవ్వాలన్నా ఐదడుగుల అందంతోపాటు
అరడగు అదృష్టం కూడా ఉండాలని.