జాతీయ వార్తలు

యాసిడ్ బాధితులు వికలాంగులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాగే పరిగణించండి
రాష్ట్రాలు, యూటీలకు
సుప్రీం కోర్టు ఆదేశం
బిహార్ బాలిక కేసులో స్పష్టీకరణ
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: యాసిడ్ దాడి బాధితులను వికలాంగుల జాబితాలో చేర్చాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశంలో యాసిడ్ దాడులు తీవ్రం కావడంపట్ల ఆందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ ప్రమాదకర పదార్థం సరఫరా, పంపిణీలో లోపాల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ధృవీకరణ లేకుండా యాసిడ్‌ను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పంపిణీ లోపాలకు సంబంధిత అధికారుల్నే బాధ్యుల్ని చేయాలని న్యాయమూర్తులు ఎమ్.వై.ఇక్బాల్, సి.నాగప్పన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. యాసిడ్ దాడి బాధితులకు ఉచిత చికిత్స, పునరావాసానికి సంబంధించిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించింది. యాసిడ్ దాడికి గురైన దళిత బాలికకు పదిలక్షల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోరింది. మొదటి ఐదు లక్షలను నెల రోజుల్లోగా, మిగతా మొత్తాన్ని మూడు నెలల వ్యవధిలో చెల్లించాలని ఆదేశించింది. కాగా, యాసిడ్ దాడికి గురైన బాధితులు ఇతరత్రా ఎదుర్కొనే మానసిక, శారీరక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని వారిని వికలాంగుల జాబితాలో చేర్చాలని తన తాజా ఉత్తర్వులో సుప్రీం కోర్టు ఆదేశించింది. వికలాంగుల జాబితాలో యాసిడ్ బాధితులను చేరిస్తే..ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్‌లతో పాటు ఇతరత్రా ప్రభుత్వాలు చేపట్టే పథకాలూ వారికి వర్తిస్తాయి.