జాతీయ వార్తలు

రాజ్యసభ నుంచి మాల్యా బహిష్కరణ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బ్యాంకులకు రుణాల ఎగవేత, మనీ ల్యాండరింగ్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ‘పెద్దల సభ’లో సభ్యుడిగా ఉండేందుకు అనర్హుడని రాజ్యసభకు చెందిన ఎథిక్స్ కమిటీ బుధవారం తీర్మానించింది. మాల్యాను ఇంకా రాజ్యసభ ఎంపీగా కొనసాగనిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని కమిటీ అభిప్రాయపడింది. ఎంపీ కరణ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఎథిక్స్ కమిటీ తన నివేదికను రాజ్యసభలో చర్చకు పంపింది. కమిటీ సిఫారసులను రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. రాజ్యసభ ఆమోదం తర్వాత మాల్యా మాజీ ఎంపీగా మారతారు. 17 బ్యాంకులకు ఆయన సుమారు 9వేల కోట్ల రూపాయలను ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. ఈడి, సిబిఐ ఎన్ని సమన్లు పంపినా ఆయన లండన్ నుంచి స్వదేశానికి వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆయన పాస్‌పోర్టును ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేయడమే గాక, లండన్ నుంచి ఆయనను వెనక్కి పంపాలంటూ బ్రిటన్ సర్కారుకు లేఖ రాసింది. తనను అరెస్టు చేసి భారత్‌కు తీసుకువచ్చినా రుణాలు చెల్లించలేనని మాల్యా ప్రకటించిన సంగతి తెలిసిందే.