జాతీయ వార్తలు

విజయనిర్మలకు పలువురు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విజయనిర్మల పార్థీవదేహనికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి ఆమె పార్ధీవదేహన్ని నానాక్‌రామ్‌గూడలోని ఇంటికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. విజయనిర్మల భౌతికకాయాన్ని చూసి కృష్ణ, ఆయన సతీమణి ఇందిరా దేవి, తనయుడు నరేశ్‌ కన్నీరుమున్నీరయ్యారు. మంజుల, మహేశ్‌బాబు, నమ్రతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మురళీ మోహన్‌ తదితరులు విజయనిర్మల భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.