వీరాజీయం

విరాట్ వీరబాదుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను సారథ్యం వహిస్తున్న 50వ టెస్ట్‌మ్యాచ్‌లో ఏ క్యాప్టన్ యింతకన్నా గొప్ప విజయాన్ని, గొప్ప కితాబును కోరుకోడు. విరాట్ కోహ్లి కన్నా ఇండియాకి టెస్ట్‌మ్యాచ్‌లలో ఎక్కువసార్లు నాయకత్వం వహించినవాడు మహేంద్రసింగ్ ధోనియే. ధోని 60 టెస్ట్‌లకి నేతృత్వం వహించి 2014లో విరాట్‌కి పగ్గాలు అప్పగించాడు. మొన్నటి పూణె మ్యాచ్‌లో టీము ఇండియా జట్టు నిజంగా అరివీర భయంకరమైన జట్టు. రికార్డులను పగులగొట్టడమే పనిపెట్టుకుంటున్నట్లుగా దక్షిణాఫ్రికామీద చెలరేగి ఆడిన కోహ్లి సేనకు యిదో జైత్రయాత్రగా మారింది. వరసగా పదిసార్లు సిరీస్‌లో గెలుపుసాధించిన ఇండియన్ క్రికెట్ జట్టు- ఇపుడు ఆస్ట్రేలియా సరసన రికార్డు పట్టుకుని నిలిచింది. మొన్నటి ఇన్నింగ్స్ విజయంతో- ఆస్ట్రేలియాని కూడా విసిరి అవతల పారేసింది. పదకొండు సిరీస్‌లలో నేరుగా విజయఢంకా మోగించిన ఈ టీముకు యిది ప్రపంచ రికార్డు.
విశాఖలో మన టీము ఆడుతున్నప్పుడే మన టీము దక్షిణ ఆఫ్రికా జట్టును అదేదో ఉప్పెనవచ్చి మీద పడ్డట్టు ఏడిపించి-ఏడిపించి- పరుగుల వర్షం, సెంచరీల జాతర అన్నట్లు- విజయం సాధించింది. విరాట్ ఆదినుంచి దూకుడుగాడే. అతను పరుగుల దండయాత్ర మొదలుపెడుతున్నప్పుడు- అందరూ ముక్కున వేలేసుకున్నారు. సచిన్ టెండూల్కర్ ప్రపంచ విజేత. ఆల్‌టైమ్ రికార్డు హోల్డర్. క్రికెట్ ‘గాడ్’ అన్నారు. రికార్డులనేవి శాశ్వతం కావు, అవి చేధించబడటానికే. రేపటి క్రికెట్‌లో నీ రికార్డుల సమీపానికి ఎవరైనా వస్తారా? అంటే ఎందుకు రాకూడదు? అంటూ లిటిల్ మాస్టర్ అన్నాడు. విరాట్‌కి చాలా అవకాశాలు ఉన్నాయి. కుర్రాడు ఇంకా చాలా క్రికెట్ ఉన్నవాడు. అని- అలాగే ముప్ఫయి ఏండ్ల విరాట్ యివాళ జలపాత సదృశ- బడబానలం లాగా- 30వ ఘన విజయం సాధించాడు.
క్రికెట్ చిత్రమైన ఆట. మైదానంలో ఏ చిత్రమైనా జరుగవచ్చు. రికార్డులు మాత్రం సాధ్యం. ఆట ‘డ్రా’అయినా బ్యాట్స్‌మెన్, బౌలర్, వికెట్ కీపర్‌లు ఏదో ఒక రికార్డు సాధించుకుంటారు. డోనాల్డ్ బ్రాడ్‌మాన్ రికార్డులు అసాధ్యం అన్నారు. సునీల్ గవాస్కర్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆడి ఆడి పాతిక సెంచురీలుచేసి క్రికెట్ చరిత్రని తిరగరాశాడు. వామ్మో పదివేల టెస్టుపరుగులా? అతను పరుగుల ఎవరెస్టు ఎక్కాడు అన్నారు. సచిన్ సెంచరీలకు సెంచరీలు బాదేసి బ్యాట్ ఎత్తిపట్టుకుని నలుదెసలా విజయ పతాకం ఎగురవేస్తున్నట్లు విన్యాసాలు చేశాడు. ఇవాళ విరాట్‌కి ధోనీ గైడెన్స్ ఉంది. పెద్ద క్రికెటర్ల అండదండలు వున్నాయి. కోచ్ రవిశాస్ర్తీ ప్రోత్సాహం వుంది. కోరుకున్న టీము దొరికింది. వడ్డించిన విస్తరి అన్నట్లయింది.
అతని టీములో రోహిత్‌శర్మ, రెహానాలు పరుగుల యంత్రాలు. మూడు సెంచురీలు ఒకేసారి చేసినట్లు రోహిత్ ఓపెనింగు చాన్స్‌లోనే చెలరేగిపోయాడు. సిక్సర్స్‌కి మనదే రికార్డు. ఇవాళ కోహ్లి నెం.3కి అంటే విజయపరంపరకి వచ్చాడు. స్టీవ్‌వా(37), రిక్కీ పాటింగ్ (35) ఆనక- మనవాడు. మొన్న అశ్విన్, జడేజాలు కూడబలుక్కున్నట్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మాన్‌ను తమ బంతులతో అష్టదిగ్బంధం చేస్తుంటే ప్రపంచం నివ్వెరపాటుతో వీక్షించింది.
పనిలోపనిగా పొడవాటి స్పిన్నర్ అశ్విన్ 356 అనే మ్యాజిక్‌ఫిగర్ సాధించాడు మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంకా ఒకటి మిగిలి ఉండగానే ‘డబుల్ ధమాకా’ అయిపోయింది. ఈ ‘చెన్నై అయ్యర్’ అశ్విన్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. అతని వేళ్ళల్లో జాదూ వుంది. ఇప్పటికి అతను 356 టెస్ట్‌వికెట్లు జేబులో వేసుకున్నాడు. ఇంతవరకూ స్పిన్నర్ నాథన్ లయన్ పేరిట (355 వికెట్లు) 88 టెస్టుల పేరిట వున్నదీ రికార్డు. అశ్విన్ 67 టెస్టులలోనే రుూ ఘనత సాధించాడు. ఎందరో అన్నారు ఈ టీములో జస్పీత్ బూమ్రా లేడు అని. కాని షమీకి రివర్సు స్వింగు బాగా తిరిగింది. దక్షిణాఫ్రికా జట్టు క్యాప్టెన్ అన్నాడు- ‘మాకు ఇవాళ అనుభవజ్ఞులు అయిన డేవిడ్ స్టీన్, డివిల్లిరస్ మార్కలాం లాంటి సీనియర్స్ లేరు’ అని. భారత గడ్డమీద భారత జట్టు పెద్దపులిలాగా వుంటుంది. దాన్ని ఓడించడం అసాధ్యం అని కాకపోతే రుూ టెస్ట్ సిరీసుకు మరో ప్రధానమైన ప్రత్యేకత వుంది. ప్రపంచంలో టెస్టుపోటీలకు అర్హతగల టీముల మధ్య ‘‘స్పర్ధ’’పెట్టి ఆడించి ఉత్తమ టెస్టు జట్టుని - ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తారు. ఈ మూడు టెస్టులూ ఆ పోటీలో భాగం. ఈపాటికే ఇండియా జట్టు టాప్ పాయింట్‌లు సంపాదించి అనితర సాధ్యమైన ఎత్తుకు ఎదిగిందా? అన్నట్లుంది. ఈనెల 23న సౌరబ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని ఏకగ్రీవంగా ఎన్నికై అందుకుంటున్నాడు. క్రికెట్‌లో స్పీడు పెరుగుతోంది. విరాట్ టీముగా ఈ పదకొండు మంది సంఘీభావం చూపడం విశేషం. రిషబ్ పంత్ పెంకితనం వృద్ధిమాన్ సహకి సమయోచితమైన స్థానాన్ని అందించడం, బూమ్రా లేని టీములో యాదవ్ ఆడి రాణించడం యివన్నీ మంచి ట్రెండ్స్. కాకపోతే ‘జిడ్డు ఆట’ ఎవడు చూస్తాడు? పరుగుల రికార్డుల కోసం తప్ప అన్న టెస్ట్‌మ్యాచులు స్పీడు అందుకున్నాయి.
ఇట్సే గుడ్ ట్రెండ్..! బ్రావో!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512