వీరాజీయం

వోటా? నోటా? లేక ‘నోటా’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యా..! చివరి గందరగోళ ఘట్టంలో పడ్డాం. 2019 ఎన్నికల పర్వం కబుర్లకి స్వస్తి చెప్పే ఘట్టం యిది. 2014కీ, యిప్పటికీ తేడా ఏమిటీ అంటే- ‘సోషల్ మీడియా’ అంటారే- అది చెలరేగిపోతున్నది. ఏది సత్యం? ఏదసత్యం? అన్న మీమాంసకి ఛాన్సు యివ్వకుండా- తటస్థుల్ని చాలా మందిని- వినోదం, విస్మయం యిచ్చి చకితుల్ని చేస్తుంది. అసలు ‘బాకా’ అంతా యూ-ట్యూబ్ ద్వారా అందుకుంటోంది.
వచ్చే నెల 11వ తేదీ నాటికి వేలికి చుక్కెట్టుకుని చాలామంది వోటర్ మహాశయులు- బయట రోడ్ల మీద పడతారు. ఏది ఏమయినా, అందాకా రుూ ఎన్నికల్లో పోటీలోకి దిగిన అభ్యర్థులంతా నడిరోడ్డున పడ్డారు. ‘‘శ్రీరామచంద్రా నారాయణా- ఎన్ని కష్టాలు (తిప్పలు) వచ్చాయిరా నాయనా’’, అంటూ- మేం మీ సేవకే అంకితం అయిపోతున్నాం,’’ అంటూ అభ్యర్థులు రోడ్లమీద పడి చెత్త డబ్బాల్లో, మురికి కాల్వల్లో దూరిపోతున్నారు. ‘‘జనం ఏం చేస్తే మేమూ అదే చేస్తాం’, అంటూ అన్ని రకాల వృత్తులనూ అనుకరిస్తూ తాత్కాలికంగా మహానటులైపోయి- ఫొటోలు, వీడియోలు దిగిపోతున్నారు.
మధుర (ఉత్తరప్రదేశ్) నియోజకవర్గంలో గోవర్థన్ గ్రామంలో హేమమాలిని- సినీ ప్రేక్షకుల డ్రీమ్‌గాళ్‌గా వాసికెక్కిన మహానటి- కొడవలి పట్టుకుని పొలాల్లోకి- బ్యాక్ గ్రౌండ్ ఆర్కెస్ట్రా లేకుండానే- దిగిపోయి- కంకులు కోయడం మొదలెట్టింది. పైగా, రుూ సినిమా స్టార్‌లు అందరూ- రుూ ఒక్కసారికే పోటీలో వుంటాం. వచ్చేసారి రంగంలోకి దిగం.. అంటూ చెబుతున్నారు.
కాకపోతే సోషల్ మీడియాలో రుూసారి సామాన్య వోటర్‌ని కూడా, ఓ క్యారెక్టర్ యాక్టర్‌గా చేసి, వీడియోలు తీసి జనాల మీదికి వొదులుతున్నారు. ‘‘చీరలకి, సారా ప్యాకెట్లకీ, కరెన్సీ నోట్లకీ కక్కుర్తిపడి వోటు వెయ్యకండి. నోట్లు అడగకుండా వోటు వెయ్యండి’’, అంటూ వోట్లు వేయడానికి పోతే లభించే లేదా- అడగవలసిన తాయిలాలూ యివీ అనీ కూడా- తమాషా తమాషాగా వీడియోలు తీసి, జనాల మీదికి వదులుతున్నారు.
మోదీజీ గవర్నమెంటు ధర్మమాని ‘అరచేతిలో వైకుంఠం’ లాగ స్మార్ట్ఫోన్లు, డేటా కార్డులు రెడీగా వున్నాయి. ఓ తొంభై కోట్ల మంది వోటర్లు వుంటే అందులో ఎనభై శాతం మంది చేత అహర్నిశలూ మొబైల్ ఫోన్లు అలరారుతున్నాయి. ప్రతివాడూ ఫోన్ పట్టుకుని అర్జెంట్‌గా, ఏదో చెరిపేస్తూనే వుంటాడు. ‘చెరపకురా చెడేవు’ అన్న సామెత పోయింది యిప్పుడు. అరచేతనున్న స్మార్ట్ఫోన్‌ని స్మార్ట్‌గా ‘‘చెరపడం’’లో, మూల మూల కుగ్రామాలలో సైతం జనాలు అద్భుతంగా ప్రాక్టీసు చేశారు. అందువల్ల ఎన్నికల ‘బాకా’ వీడియో రూపంలో కొత్త అవతారమెత్తింది.
ఓ వోటర్‌ని మరో వోటరు- ‘‘నోటా? కైండా?’’ అనడిగాడు- మొబైల్ మీద వో కనే్నసి. అంటే కుట్టుమిషన్లు, సైకిళ్లూ, మొబైల్సూ వగైరా బహుమానాలా? లేక...’ అని అర్థం. మోదీజీకి థాంక్స్! ఆయన వెయ్యి రూపాయల నోట్లు ఎత్తేశాడు. ‘‘రెండు వేల రూపాయల నోటుకన్నా తక్కువయితేను ముట్టేదిలేదూ’’ అంటూ, దసరా పద్యాలకి మార్పు వచ్చింది. ‘‘అర్ధ రూపాయి అయితేను అంటేది లేదు. రూపాయి అయితేను ముట్టేది లేదు. అయిదు వరహాలు అయితేను చాలు,’’ అన్న పాటలాగా రుూ బేరసారాలకు సీక్రెట్ ఏజెంట్స్ కూడా తయారు అయినారట. మొట్టమొదటిసారి వోటర్ శీలాన్ని శంకించే కార్యక్రమాలు- వీడియోలు బయలుదేరాయి.
గడుసు వోటరు లేదా సిన్సియర్ వోటరే అనుకుందాం- ‘‘నోటా?’’ అంటూ జవాబిస్తున్నాడు. అంటే, ‘‘నా వోటు ఎవ్వరికీ యివ్వకుండా- ‘నోటా’ మీట నొక్కుతాను’’ అంటూ. ‘‘ఒట్టూ- భారతమాత మీద ఒట్టూ’’ అన్నాడు ఒక పెద్ద మనిషి. అదేం నేరమా? ఘోరమా? పోనీ పాపమా?
‘నోటు’ తీసుకుంటూ దొరికిపోయావు’’ అంటూ ఆ ‘నోటు’లాక్కుని, ఆ శాల్తీని పట్టుకుని తీసుకుపోయి... బొరిలో తోసేస్తున్నారా? అంటే- యిచ్చిన వాడికీ జై- తీసుకున్న వాడికీ జై’’ అన్నట్లుగా వుంది కథ.
వో పెద్దమనిషి- మీ వోటు ‘నాకే’నంటూ, చేపలు కడిగి, వాటిని కోసి చేపల పులుసుకి అందిస్తూ- మరో అభ్యర్థినీ, ఓ వోటర్‌నీ కూర్చోబెట్టుకుని- తలలో పేలన్నీ తీసి నొక్కుతూ- ‘‘తలంటి పోస్తా, పద’’- అంటూ లేచి- రుూలోగా తన మీద పోటీచేస్తున్న వ్యక్తిమీద- ‘‘రేపిస్టు’’, ‘‘పాపిస్టూ’’- రుూ ‘‘యిష్టూ’’, ఆ ‘‘యిస్టూ’’- అంటూ- తన బలగం సాక్షిగా ‘నిందాగానం’ చేస్తాడు. ‘‘బృందగానం చేసినా, నిందాగానం చేసినా గ్రామాలలో వోటర్లు బాగా తెలివి మీరి పోయారు. సార్!’’ అంటూ ఓ కాన్వాసాసురుడు చెప్పుకొస్తాడు.
‘సొమ్మొకడిదీ సోకొకడిదీ’ అన్నట్లు- ‘‘యిక్కడ నోటు నొక్కేయ్... అక్కడ వేరే పేరు నొక్కేయ్’’ అన్నట్లుగా తయారైంది. ‘‘అదేందిరా అన్నా?’’ అంటే- ‘‘్ఫ్యన్‌కీ హెలీకాఫ్టర్‌కీ తేడా తెలీలేదన్నా’’ అంటాడు.
‘‘రెండు పేర్లూ ఒక్కలాగే వున్నాయి. కన్‌ఫ్యూజన్ అయిపోద్దేమో’’నంటూ బేరం పెంచుతాడు నేటి కలికాలపు వోటరు- అంటున్నారు ప్రచార ఏజెన్సీల కార్యకర్తలు.
ఒక అభ్యర్థి కొలిమి తిత్తి వూదుతాడు. మరొక అభ్యర్థిని అర్జెంటుగా వొడియాలు పెడ్తూ, అప్పడాలు వత్తుతూ- వీడియో దిగుతుంది. ‘‘రా, బాబూ!’ అని ఒకడు గుండు గొరిగితే, మరొకడు ‘‘రా బాబూ! లాలబోస్తా’’నంటూ రెడీ. ఈమధ్యలో బాగుపడుతున్నది మాత్రం వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు మాత్రమేనంటూ వాపోయాడు ఓ వర్కరు.
‘‘పుల్లట్లు పోసే ఓ అభ్యర్థినికి ‘ఆస్తి’- అధికారికంగా నామినేషన్లో కొన్ని ‘‘కోట్లు’’ వుంటుంది. కానీ, యిక్కడికొచ్చి కాఫీ కప్పులు, యిడ్లీ ప్లేట్లూ ‘‘కడిగేస్తా’’నంటూ పోజులు పెడుతుందని అంటున్నాడో న్యూస్ కంట్రిబ్యూటరు.
‘‘మరి నీకు ‘మేత’ వొద్దా? ఏంటి రాస్తావు బాబూ? పేపర్లో? ‘‘్ఫలానా కేండిడేటు సుమతీ శతకం’ పద్యాలు అప్పజెప్పాడు అంటూ రాస్తావా?’’ అనడిగాడో రాజకీయ పక్షేంద్రుడు.
‘‘ఏది ఏమయినా వోటర్‌ని యింత దిగజార్జడం ఏం బాలేదు బ్రదర్. అందుకే రుూసారి నేను మా వూరుపోయి వోటు- వెయ్యాలనుకోవడం లేదు’’ అన్నాడు వో బాసుందీరావు. సరే! డోన్ట్ వర్రీ! నీ వోటుకి మంచి బేరమే తగులుద్దిలే. అందులోనూ మీవూరు (కసిగా) మహా ‘‘కిలాడీ!’’ అన్నాడు. ఇవతలివాడు అంతలో- సైకిల్ జెండాల నాయకులు అక్కడ మిర్చీబజ్జీ, కమలం పార్టీ నాయకులు యిక్కడ బిర్యానీ వండేస్తున్నారు. రుచి చూద్దురు పదండి’’ అంటూ వోటర్లు యిద్దరూ కదిలారు. కదిలేదీ కదిలించేదీ- తిట్టేదీ, తిరిగి చచ్చేలా తిట్టించేదీ కావాలోయ్ నవ ప్రపంచానికి.. అంటూ ఎన్నో ‘స్కిట్’లూ ‘స్క్రిప్టు’లూ రెడీ చేసే రచయితల గ్రూపులు తయారయ్యాయ్ అని అంటున్నాడు వో దేశ సంచారి. జగన్‌లో ‘గన్’, చంద్రబాబులో ‘బాంబు’ వున్నాయిట- వాళ్లే చెప్పుకుంటున్నారు పరస్పరం తిట్టుకుంటూ.
అవర్ స్లోగన్ రుూజ్ ‘జై డెమొక్రసీ’!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512