వీరాజీయం

ఉత్తరాఖండ్ సంకట విమోచక సుప్రీం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమైతేనేల? ధర్మ సందేహాల పుట్ట దాని మీద కొట్టకుండా, పుట్ట చుట్టూ నాగస్వరం పెట్టిన సుప్రీంకోర్టు తన సర్వోన్నత ఆధిపత్యాన్ని నిరూపించుకొని- ఉత్తరాఖండ్‌లో యేర్పడిన సంక్షోభాన్ని గట్టెక్కించింది. అక్కడ ప్రజలు అమ్మయ్య ఓ గవర్నమెంటు ఏర్పడింది అనుకొనేలాగా చేసింది. ఐతే యిక్కడ సుప్రీంకోర్టు ‘‘బెత్తం’’తానే చేతబట్టి క్లాసునీ తానే చేతబట్టి పాఠంలానే కండెక్టు చేసినట్లు- క్లాసు టీచర్‌ని అవతలకి త్రోసేసినట్లు- చాలమందికి అనిపించవచ్చును. కాని, లోగడ తొమ్మిది మంది న్యాయమూర్తులున్న ధర్మాసనం బొమ్మయ్ కేసులో చెప్పింది ఒక్కటే సంగతి. ఆ విషయాన్ని రుూసారి కూడా సుప్రీం నిలబెట్టింది. ‘‘బలపరీక్ష అసెంబ్లీలోనే జరగాలి’’. ఎవరు మెజారిటీలో వున్నారు? ఎవరు సభలోని ఎమ్.ఎల్.ఏ.ల విశ్వాసాన్ని కోల్పోయారు?- మెజారిటీ బలాన్ని పోగొట్టుకున్నారు? అన్నది సుప్రీంకోర్టు సొంత అజమాయిషీలో నిర్వహించింది.
అసెంబ్లీలో ఏంచేసినా దాని సభాపతి ఆధ్వర్యంలో జరగాలి అన్నదొక సంప్రదాయంగా వున్నది. సంప్రదాయం అనే అనాలి మరి. కాకపోతే అదే ‘రూలు’ అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం అలాచేసి ఉండదు గదా అని మనం సమర్ధించుకోవాలి. రాష్టప్రతి పాలనను విధించడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసేటంత బలహీనంగా, అతి ఆత్రంగా జారీచేసిన భారతీయ జనతాపార్టీ అవాక్కయిపోయింది. అటువంటి ఆత్రం లోగడ చూపించి విఫలమైన ‘‘సంఘటనల్ని- ఆ పార్టీ ‘‘్థంక్ టాంకు’’ సరిగ్గా అనుశీలన చేయలేదు. పోనీ రాష్టప్రతి పాలన ఆర్టికల్ 356 క్రింద పెట్టదల్చుకుంటే గవర్నర్ చేత యిక్కడ ‘‘అమ్మోయ్! బాబోయ్! కొంపలు అంటుకుపోతున్నాయ్’’అంటూ ఒక ఆర్తనాదాన్ని తెప్పించుకోవలసింది. గవర్నర్ ఎంతసేపూ సన్నాయి నొక్కులు నొక్కాడే గాని ‘‘యిక్కడ రాజ్యాంగం విఫలమయింది’’అని ఖరాఖండీగా రిపోర్టు పంపలేదు. అసలు జరిగినదంతా ఆ తొమ్మిది మంది ‘‘అయోగ్యులు’’గా ప్రకటించబడ్డ తిరుగుబాటు ఎం.ఎల్.ఏలు కాదా? వాళ్ళమీద పడ్డ వేటు సమంజసమా? అన్న అంశం యింకా సుప్రీంకోర్టులోనే వుంది. ఎండాకాలం శలవులు అయినాక గానీ, కోర్టు వాళ్ల ‘‘స్థితి’’గతులు చెప్పరు. కాకపోతే రుూ సుప్రీంకోర్టు నేరుగా నిర్వహించిన బలపరీక్ష యిది అని అందరూ ఒప్పుకుంటారు. ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నుకోబడ్డ సభాపతి వుండగా, అతని పర్యవేక్షణలో సాగాల్సిన బలపరీక్షను సుప్రీంకోర్టు- అసెంబ్లీ కార్యదర్శి సూపర్ విజన్‌లో చేసింది. సదరు వోటింగ్ మొత్తం రికార్డుని తానే అందుకుని పరిశీలించింది. ఈ పరిస్థితులకి దారితీసిన రాష్టప్రతి పాలనని చాలామంది విజ్ఞులు- రాజ్యాంగ పండితులు కూడా సందేహాస్పదంగానే చూశారు. కాని అసలు అంతకుముందు జరిగిన అసెంబ్లీ సమావేశాలు కూడా ఒక్కసారి చూస్తే స్పీకర్‌గారు మనం అసెంబ్లీ ‘‘బాస్’’గా అంగీకరిస్తూన్న స్పీకర్‌గారు- అక్కడ అపారమైన దుందుడుకుతనం ప్రదర్శించిన సంగతి తెలుస్తుంది- అది అడుగున పడిపోయింది. అంచనాల బిల్లుమీద వోటమి ప్రభుత్వ వోటమి గానే స్వీకరించాలి అన్న అంశాన్ని ప్రక్కనబెట్టండి. దాన్ని ద్రవ్య బిల్లుగా పరిగణించాలా? అక్కరలేదా? అన్న అంశం మీద ఒక సంజాయిషీ- ఒక వితరణ యివ్వాల్సిన స్పీకర్ అలా చేయలేదు.
అదుగో మనవాళ్లు ‘‘అరిచారు గట్టిగా’’అంటూ ‘‘మూకీ వోటింగ్ మీద పరిపూర్ణ విశ్వాసం ప్రకటించడం- బలపరీక్షకు ఆర్డర్ వేయడం జరిగింది. ఒకవేళ బలపరీక్ష జరిగితే హరీశ్‌రావత్‌గారు గట్టెక్కేస్తాడేమోనన్న అనుమానంతో కేంద్రం రాష్టప్రతి పాలన ప్రవేశపెట్టింది. అదీ ఎందుకు? అన్నది ‘‘్ఫ్లర్ ఆఫ్ ది అసెంబ్లీ’’మీద బలపరీక్ష జరిగితే కాంగ్రెసు పార్టీని విజేతగా నిలబెడుతుందేమోనన్న భయంచేతనే కదా?
సరే. ఈ రెండు అతి ఉన్నతమైన పదవులు- ఒకటి- రాష్టప్రతి పీఠం- రెండూ ఒక అసెంబ్లీయొక్క సభాపతి పీఠం.. రెండూ రుూ గందరగోళ రాజకీయ పితలాటకంలో పరాభవం చెంది పచ్చడి అయిపోయాయి. ఆ సంగతి రాజకీయ వాదులు కాదు రాజ్యాంగ నిపుణులు సుప్రీం న్యాయమూర్తుల ధర్మాసనం పచరించవలసి వుంటుంది. అసలు హైకోర్టు కొట్టేసిన రాష్టప్రతి పాలన విధింపుమీద- సుప్రీంకోర్టులో అంచెలంచెలుగా పట్టువిడువని విక్రమార్కుడు లాగా ఛాలెంజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆ విషయంలో తీర్పుని యింకా అందుకోవలసి వుంది. ‘‘శలవులు అయినాక’’అంటూ సుప్రీంకోర్టు ఆ కేసుని పక్కనపెట్టింది. అలాగే 9 మంది అయోగ్యుల సంగతి ఏమీ తేల్చబడలేదు. ఈలోగా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ పేరిట సుప్రీం తాత్కాలికంగా రాష్టప్రతి పాలనను తొలగించి బలపరీక్షకు ‘‘నిద్రపోతున్న అసెంబ్లీని’’ తట్టిలేపి సమావేశపర్చింది. ‘‘మంత్రివర్గం మీద మాకు విశ్వాసం లేదు’’ అనవలసిన అసెంబ్లీ సదరు తీర్మానాన్ని స్పీకరుగారి సమక్షంలో ఆధ్వర్యంలో ప్రవేశబెట్టడం జరిగిందా? లేదు. ఇరుపక్షాలు అటు -యిటూ కూర్చొని వోటింగ్‌లో పాల్గొన్నాయి. గోప్యంగా ఈ ఫలితాన్ని ‘రిఫరీ’ సుప్రీంకోర్టు లెక్కించింది. ఆ విధంగా శ్రీ సురేశ్‌రావత్ తిరిగి తన కుర్చీని దక్కించుకున్నాడు. వెంటనే ఢిల్లీకి పోయి సోనియాగాంధీని కలుసుకున్నాడు. వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ ఎన్నికలు జరగాలి అన్నది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఈలోగా ‘చటుక్కున ఎలక్షన్స్ అహో’’ అంటూ పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్దామా? వద్దా? అన్న ప్రశ్న కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకోవాలి. సురేశ్ రావత్‌గారు ఆ నిర్ణయం తీసుకుంటే భా.జా.పా.కి కొంత అయినా ‘‘ఆ బోరు’’దక్కుతుంది. అంతా బాగానే వుంది. రాజ్యాంగ సంక్షోభం లేదు. గవర్నరుగారూ ఓ.కే. శాంతి భద్రతలు ఓ.కే. అంటూ రావతుగారు అదే నోట ఎన్నికలకు పోదాం అనలేడు. అతని మెడకి వేరే ‘‘ఉచ్చు’’ వున్నది. - కనుక ‘‘శలవుల మీద’’లే చక్కాపోయిన ధర్మాసనం న్యాయమూర్తులు తిరిగి కొలువుతీరేదాకా ఎన్నో ‘‘్ధర్మసందేహాల మీద చర్చ’’ ‘‘రంజు’’గా సాగుతూనే వుంటుంది. స్పీకర్ ‘‘నా పదవిని’’ చితక్కొట్టారండీ అంటూ కోర్టుకు వెళ్ళగలడా? అంటే అది సమ్మర్ వెకేషన్ తరువాతనే. అందాకా సురేశ్‌రావత్‌జీ విజేత. ప్రజాస్వామ్యం కాపాడబడింది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందిట! అన్నట్లు సుప్రీం సంకట స్థితిని గట్టెక్కిచ్చింది.
బ్రావో వెల్‌డన్ సుప్రీంకోర్టు!