విజయవాడ

కలసాకరవౌతున్న వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జూన్ 7: అడ్టంకులు... అంతరాలు... అభ్యంతరాలన్నిటినీ అధిగమించి చివరి ప్రతిపాదిత ఫైఓవర్ నిర్మాణం ప్రారంభం కానుంది. దశాబ్దకాలంగా నగర వాసులు కలలు కంటున్న బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణ కల సాకారం కానుంది. గతంలో ప్రతిపాదించిన 618 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థానికుల విన్నపాలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం అదనంగా మరో 820 మీటర్లు ప్రతిపాదిత నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం అదనంగా మరో 120 కోట్ల నిధులను మంగళవారం విడుదల చేసింది. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పున్నం రాధా కృష్ణన్ మంగళంవారం నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. అయన ప్రకటించిన కొద్దిసేపటికే కేంద్రం అనుమతులు, నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తీరనున్న కష్టాలు...
నగరానికి నడిబొడ్డున ప్రధాన నాలుగు కూడళ్ల మధ్యలో ఉన్న బెంజి సర్కిల్ వద్ద ఎదురవుతున్న ట్రాఫిక్ కష్టాలు ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో తీరనున్నాయి. గత ప్రభుత్వాలు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఎన్ని వినతులు వచ్చినా పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంపి కేశినేని నాని చొరవ చూపారు. ఇందుకోసం ముందుగా నిర్మలా కానె్వంట్ రోడ్డు నుండి ఫ్లైఓవర్ నిర్మాణం కోసం సుమారు 618 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణ ప్రణాళికలు సుమారు 740 కోట్లతో అధికారులు సిద్ధం చేశారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం దీనికి కొన్ని అభ్యంతరాలు తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ అధికంగా ఉండే నిర్మలా కానె్వంట్ నుండి కాకుండా రమేష్ హాస్పటల్ నుండి ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని గట్టిగా పట్టుబట్టారు. దీంతో ఈ పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ఎంపి నాని అధికారులు, స్థానిక నాయకులతో కలసి మరోసారి ప్రతిపాదిత ప్రాంతాల్లో పలు దఫాలు పర్యటించి మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీరి ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించిన కేంద్రం అనుమతుల మంజూరుతో పాటు అవసరమైన నిధులను సైతం విడుదల చేసింది.