విజయవాడ

ఎఇఎఫ్‌డిఎస్ విధానంలో ఎరువుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 7: దేశంలోనే ప్రప్రథమంగా ఎరువుల వినియోగ క్రమబద్ధీకరణ విధానంలో పైలెట్‌గా ఎంపికైన కృష్ణా జిల్లాలో జూన్ 2వ వారంలో జిల్లాలోని 1100 ఎరువుల దుకాణాల్లో అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. మంగళవారం ఆధార్, ఆధారిత, ఎలక్ట్రానిక్ మేనేజ్‌మెంట్ విధానంలో ఎరువుల పంపిణీపై జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సబ్ కలెక్టర్ డా.జి.సృజన, వ్యవసాయశాఖ డిడి ఎన్.బాలూనాయక్, ఎన్‌ఐసి అధికారి శర్మ, డిడిఓ అనంత్, తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల వినియోగాన్ని ఆయా ప్రాంతాల, పంటల ఆధారంగా సక్రమంగా వాడాల్సిన ఆవశ్యకత వుందన్నారు. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలోని 39 జిల్లాల్లో ఎరువుల పంపిణీని, వినియోగాన్ని క్రమబద్దీకరించేందుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రప్రథమంగా కృష్ణాజిల్లాలో అమలుచేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని మిగతా జిల్లాల్లో అమలుకు చొరవ చూపించే విధంగా భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఈ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుందని బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కపైసా కూడా భారం పడటం లేదని ఎఐఎఫ్‌డిఎస్ అమలుకు ప్రధాన డీలర్లకు జిల్లాస్థాయి, మండల స్థాయి వ్యవసాయాధికారులను జూన్ 10వ తేదీన కలెక్టర్ చాంబర్‌లో శిక్షణ అందిస్తామని, 11వ తేదీన రిటైల్ డీలర్లకు డివిజన్ స్థాయిలో శిక్షణ అందించి పరికరాలను అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జూన్ 2వ వారంలో ముఖ్యమంత్రి సమక్షంలోను కేంద్ర ఆర్ధిక సలహాదారు సమక్షంలో కృష్ణా జిల్లాలో అన్ని ఎరువుల దుకాణాల్లో ఎరువుల పంపిణీ విధానాన్ని అమలుచేసి ప్రారంభిస్తామన్నారు. తొలి దశలో కృష్ణా జిల్లాలో అమలుచేస్తున్న విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 39 జిల్లాల్లోను తదుపరి దేశవ్యాప్తంగా అమలుచేస్తారని తద్వారా ప్రభుత్వానికి 40 వేల కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందన్నారు.