విజయవాడ

విభజనపై బాబు మొసలి కన్నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జూన్ 6: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అన్యాయం చేశారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని, పాడిందే పాడరా.. అన్న చందంగా ప్రతి సభలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయం దాసరి భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించాలని, విభజనకు తమ పార్టీ అనుకూలమంటూ పార్టీలో తీర్మానం చేసి ప్రణబ్‌ముఖర్జీ కమిటికి రెండు లేఖలు ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. విభజన గురించి తనకేమి తెలియదన్నట్లు, ఎవరో ఏదో చేశారన్నట్లు, రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయినట్లు నవ నిర్మాణ దీక్షల సభల్లో చంద్రబాబు మోసపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేక, ఈ రెండేళ్ళల్లో షో చేసిన చంద్రబాబు జపాన్, చైనా, సింగపూర్ ప్రాజెక్టుల్లో కదలిక లేక, కేంద్రం నుండి విభజన హామీలు సాధించలేక ప్రజల్ని పక్కదారి పట్టించడానికి, మోసగించడానికి చేస్తున్న ఇదో రకమైన ఎత్తుగడన్నారు. సిపిఎం తప్ప రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయ పార్టీలు కారణమేనన్నారు. చంద్రబాబు 2008, 2012 సంవత్సరాల్లో రెండు లేఖలు ఇవ్వగా, బిజెపి వారు దానికి ముందే 1996లో కాకినాడ సదస్సులో రెండు రాష్ట్రాలు అవసరమని తీర్మానం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇంత చేసిన తర్వాత ఎవరో ఏదో చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి సభలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.