విజయవాడ

ఉద్యోగం పేరిట మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జూన్ 7: ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక మహిళ నుండి లక్షల రూపాయలు తీసుకుని మోసగించిన వ్యక్తులపై నున్న గ్రామీణ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయకాపురంలో నివాసముంటున్న మల్లాదికుమారి కుమారుడు నాగేంద్రబాబు నగరంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి కండ్రికలోని మహేష్‌రాజు అనే స్నేహితుడు ఉన్నాడు. తనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారని, వారి ద్వారా విటిపిఎస్‌లో ఉద్యోగాలు పొందవచ్చని మహేష్‌రాజు చెప్పడంతో అతని మాటలు నమ్మిన నాగేంద్రబాబు ఆ విషయాన్ని తన తల్లికి చెప్పాడు. ఆ వ్యక్తుల్ని తన వద్దకు తీసుకురమ్మని ఆమె సూచించడంతో కృష్ణలంకకు చెందిన అవనిగడ్డ శ్రీహరి, కబేళా సెంటర్‌కు చెందిన సత్యనారాయణ, నగరానికి చెందిన మరో వ్యక్తి దూప్‌సింగ్‌ను నాగేంద్రబాబుకు మహేష్‌రాజు పరిచయం చేశాడు. విటిపిఎస్‌లో తనకు తెలిసిన వాళ్లు ఉన్నారని, ఉద్యోగం కావాలంటే పెర్మనెంట్ చేయిస్తామని, ఇందుకు 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని మల్లాదికుమారిని కలిసి వివరించారు. వీరి మాటల్ని నమ్మిన కుమారి వీరికి 3 లక్షల 25 వేలు ఇచ్చింది. డబ్బులు ఇచ్చి రోజులు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోగా ముఖం చాటేయడంతో బాధితురాలు నున్న పోలీసుల్ని ఆశ్రయించింది. కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.