విజయవాడ

నగరం నుంచే ‘రాష్ట్ర రవాణా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 9: రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో లాజిస్టిక్స్ విభాగంలో ప్రధాన భూమిక వహించే రాష్ట్ర రవాణాశాఖ కార్యాలయం విజయవాడలో ప్రారంభించటం ఎంతో అభినందనీయమని కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో భవన సముదాయంలో రాష్ట్ర రవాణాశాఖ కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ప్రాంతం నుంచి జూన్ 27 నాటికి కార్యకలాపాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో రవాణాశాఖ రాష్ట్ర కార్యాలయం తరలింపును రెండు దశల్లో పూర్తిచేయటం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులను సమకూర్చటంలోను, రాష్టస్థ్రాయి కార్యాలయ ఆవశ్యకత నేపథ్యంలో మొదటి దశలో సుమారు 80 మంది అధికారులతో కూడిన సిబ్బంది జూన్ 27కు, రెండో దశలో జూలై 15 నాటికి మిగిలిన సిబ్బంది విజయవాడకు తరలి రావటం జరుగుతుందన్నారు. రాష్టస్థ్రాయి కార్యాలయంలో సుమారు 150 మంది అధికారులు, సిబ్బంది వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యాలయానికి చెందిన ఫర్నీచర్, తదితర వౌలిక సదుపాయాలను ఈనెల 27 నాటికి పూర్తిచేసి రికార్డులను తీసుకురావటం జరుగుతుందన్నారు. 13 జిల్లాలకు చెందిన అధికారులు ఈనెల 27 తరువాత విజయవాడ కార్యాలయం ద్వారా పాలన జరపాల్సి ఉంటుందని బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. రాష్ట్ర రవాణాశాఖ నాన్ టెక్నికల్ సంఘం అధ్యక్షుడు డి.మణికుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడకు ఎటువంటి షరతులు లేని ఒప్పందంతో రాష్ట్ర ప్రభుత్వం నవ్యాంధ్రలో ఆర్థికలోటు తదితర అంశాల ప్రతిపాదిక నేపథ్యంలో ముఖ్యమంత్రి పిలుపు మేరకు జూలై నాటికి పూర్తిస్థాయి సిబ్బంది ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చేపడుతున్న విభిన్నవంతమైన కార్యకలాపాలకు తాము పూర్తిగా సహకరించటం జరుగుతుందని ఆర్థికంగా శాఖను పటిష్ఠపరచటంలో ఆలోచనా దృక్పథం బాగుందని అభినందించారు. సాంకేతికేతర సిబ్బంది అందరూ రాష్ట్రంలో చేపట్టిన సాంకేతికత అభివృద్ధి పథంలో ఒకేమాటగా పనిచేస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఎస్‌ఎవి ప్రసాదరావు, ఇన్‌ఛార్జి డిటిసి ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్టీవోలు మూర్తి, కె.శంకరరావు, బి.బాలశౌరి, ఎస్‌టిఎ ప్రెసిడెంట్ బి.ప్రమీల, సిఎవో సుబ్రమణ్యం, రాష్టస్థ్రాయి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.