విజయవాడ

పుష్కర పనుల పూర్తికి చర్యలేమిటి ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 9: కృష్ణాపుష్కరాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైనందున నగరంలో జరుగుతున్న పుష్కర పనుల పూర్తికి అధికారులు ఏయే చర్యలు తీసుకొంటున్నారంటూ విఎంసి కమిషనర్ వీరపాండియన్ విఎంసి ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. ఈ గురువారం ఉదయం నగరంలోని మూడు సర్కిల్ కార్యాలయాల్లో జరుగుతున్న పుష్కర పనులను స్వయంగా పరిశీలించిన ఆయన అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఇంకా కొన్ని అభివృద్ధి పనుల్లో నెలకొన్న జాప్యం పట్ల కాంట్రాక్టర్ల తీరుతోపాటు అధికారుల తీరుపై మండిపడ్డ అయన సత్వరమే ఆయా పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూలై నెలాఖరు కల్లా డెడ్‌లైన్ విధించిన తరుణంలో ఆ లోపుగానే రోడ్డు విస్తరణ పనులతోపాటు వివిధ వసతుల కల్పనలను అందుబాటులోకి తేవాలన్నారు. సర్కిల్ -1 పరిధిలోని పంజా సెంటర్ నుండి నెహ్రూ రోడ్డులో జరుగుతున్న విస్తరణ పనులకు సంబంధించి రైల్వే వారి పరిధిలో గల కట్టడాలను తొలగించి రోడ్డు విస్తరణకు గాను వెస్ట్ బుకింగ్ కౌంటర్ వద్దల ఫుట్ బ్రిడ్జిని మార్పు చేయుటకు గల అవకావాలను పరిశీలించడమే కాకుండా ఆయా పనులను చేపట్టాలన్నారు. కొండ ప్రాంతాల్లో విస్తరణకు అవరోధంగా ఉన్న ఇతర నిర్మాణాలు, విద్యుత్ సబ్ స్టేషన్ తొలగింపు చర్యలను వేగవంతం చేయాలన్నారు. గాంధీ హిల్ నుంచి కాళేశ్వరరావుమార్కెట్ బస్ టెర్మినల్ వరకూ గల ప్రైవేటు భవనాల మార్కింగ్ వరకూ జరుగుతున్న విస్తరణ పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. తదుపరి భవానీపురం పున్నమి ఘాట్ వద్ద జరుగుతున్న రోడ్డు ఎలైన్‌మెంట్ పనులు, పుష్కర ఘాట్ పనులను పర్యవేక్షించిన ఆయన వాటి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. నగరంలో ప్రతిష్ఠాత్మకమైన తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించిన వీరపాండియన్ ప్రస్తుతం జరుగుతున్న సీలింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. సర్కిల్ -3 పరిధిలోని రాణిగారి తోట వద్ద జరుగుతున్న బిటి రోడ్డు పనులను పరిశీలించి నేపథ్యంలో సదరు రోడ్డు చిన్న రోడ్డుగా అవలటంతో రోడ్డు రోలర్ తిరుగు సందర్భంలో వైబ్రేషన్‌కు పైపులు పాడవుతున్నాయంటూ అధికారులు వివరించిన మీదట ఆ రోడ్డును సిమెంట్ రోడ్డుగా నిర్మించాలని సూచించారు. స్వర్గపురి వద్ద ఇరిగేషన్ శాఖ చేపట్టిన పుష్కర ఘాట్‌కు నిర్మాణమునకు గల అడ్డంకులను పరిశీలించిన ఆయన డైనేజీ నుంచి మురుగు నీరు, వర్షం నీరు ఒకే ప్రాంతంలో కలుస్తున్నందున ఘాట్ నిర్మాణ పనులకు ఇబ్బందవుతోందని అధికారులు తెలిపిన మీదట తక్షణమే మురుగు నీటి మళ్లింపునకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఇ ఎంఎ షుకూర్, సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్, ఇఇ ఓంప్రకాష్ పాల్గొన్నారు.