విజయవాడ

నాణ్యత ప్రమాణాలతో పుష్కరఘాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 10: పుష్కర ఘాట్ల పనులను వేగవంతంగా చేపట్టడం అభినందనీయమైనప్పటికీ నాణ్యతా ప్రమాణాలను పాటించటంలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా ఘాట్ల నిర్మాణాలను పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం సీతమ్మవారి పాదాలు, దుర్గాఘాట్, పుష్కర నిర్మాణ పనులను మంత్రి ఉమ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ పనులను ఆదివారం సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తుండడం అభినందనీయ మన్నారు. నిర్మించే పుష్కర ఘాట్లు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ఘాట్లను నిర్మించాలని మంత్రి అధికారులకు సూచించారు.