విజయవాడ

పార్కింగ్ సౌకర్యం లేకపోతే దుకాణం మూసివేతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 10: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టిన ప్రస్తుత తరుణంలో విస్తరించిన రోడ్లపై వాహనాల పార్కింగ్ చేస్తున్న వైనంపై కమిషనర్ వీరపాండియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పర్యటనలో భాగంగా శుక్రవారం నగరంలోని పలు రహదారుల విస్తరణ పనులను పరిశీలించిన ఆయన రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్న వాహనాల తీరుతోపాటు స్థానిక వ్యాపారుల తీరుపై మండిపడ్డ ఆయన రోడ్ల విస్తరణకు అవరోధం కలిగించే ప్రతి ఆక్రమణలను తొలగించాలన్నారు. ట్రాఫిక్ రాకపోకలకు అవరోధాలు సృష్టించే వాహనాల పార్కింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని, పార్కింగ్ లేని దుకాణాలను తక్షణమే తొలగించే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పటమట నిర్మలా కానె్వంట్ రోడ్డులో ఏవిధమైన పార్కింగ్ సదుపాయం లేకుండా షాపు నిర్వహిస్తున్న దుకాణాన్ని తక్షణమే తొలగించాలని ఆయన పేర్కొన్నారు. తొలుత మహానాడు రోడ్డు, గురునానక్ రోడ్డు, హైటెన్షన్ లైన్ రోడ్డు తదితర రహదారుల విస్తరణ పనులను పరిశీలించిన వీరపాండియన్ అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే పులేటి వారి వీధిలో రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న 5గృహాలకు చెందిన యజమానులతో చర్చించి రోడ్డు పనులు సజాజవుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్థానికంగా ఉన్న హెల్త్ సెంటర్‌ను మరొక ప్రాంతానికి తరలించాలని ప్రజారోగ్య శాఖాధికారులను ఆదేశించారు. తదుపరి వన్‌టౌన్ ప్రాంతంలో చేపల మార్కెట్ వద్ద సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు గుర్తించిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. విటిపిఎస్ నుంచి మసీదు రోడ్డు వరకూ నది వెంబడి ఉన్న నివాసాల తొలగింపు ప్రక్రియను పర్యవేక్షించిన వీరపాండియన్ కరకట్ట సుందరీకరణ పనులు, భవానీఘాట్ పనుల పురోగతి పనుల స్థితిగతులను పరిశీలించారు. ఈ పర్యటనలో సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్, ఇఇ ధనుంజయ, ఓంప్రకాష్, కెఆర్‌కె సత్యనారాయణ, గ్రీన్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రామారావు, టిపిఎస్ వెంకట కృష్ణ పాల్గొన్నారు.