విజయవాడ

ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లో మచిలీపట్నం బీచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 10: మచిలీపట్నం బీచ్ ఇకపై ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌గా మారబోతుందని టూరిజం శాఖ ఆధ్వర్యంలో సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కలెక్టర్ బాబు, టూరిజం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం బీచ్ అభివృద్ధి పనులు తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. బీచ్ స్వరూపం పూర్తిగా మారిపోవాలని దీనికోసం టూరిజం శాఖ పనులు తక్షణమే చేపట్టాలన్నారు. బీచ్‌లో టూరిజం అభివృద్ధి చేస్తే ఎంతోమంది ఔత్సాహికులు వస్తారని మంత్రి తెలిపారు. బీచ్‌లో రిసార్ట్స్, పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, స్పోర్ట్స్, హోటల్స్, అన్ని రకాల టూరిస్టులను ఆకట్టుకునే విధంగా నిర్మించాలని సూచించారు. ఈ పనులు ప్రారంభించటంతోపాటు శరవేగంగా పూర్తిచేస్తామని కలెక్టర్ బాబు తెలిపారు. మచిలీపట్నం అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని, పట్టణానికి ఉన్న చరిత్రను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి అన్ని విధాలా బందరు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారని కొల్లు తెలిపారు. దీనికోసం ఇప్పటికే పుష్కర పనుల్లో భాగంగా కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో బందరు పోర్టు నిర్మాణం చేపడతే ఈ ప్రాంతంలో కొన్నివేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రస్తుతం బీచ్ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఇది పూర్తయితే బీచ్ స్వరూపంతో పాటు మచిలీపట్నం టూరిజం రూపురేఖలు మారిపోతాయని కొల్లు రవీంద్ర వివరించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డీవోతో పాటు టూరిజం శాఖ అధికారులు పాల్గొన్నారు.