విజయనగరం

వైభవంగా శివపార్వతుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 6: పట్టణంలోని కంటోనె్మంట్ ఉడాకాలనీ ఫేజ్-3లో వేంచేసి ఉన్న ఉమామహేశ్వరస్వామివారి దేవాలయంలో సోమవారం శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శివాలయం కార్యదర్శి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సంతోష్ శివపార్వతుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కోట్ల సుగుణాకరరావు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి విశేష కృషి
గరుగుబిల్లి, జూన్ 6: రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిదులు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం మీఇంటికి-మీభూమి, పొలంపిలుస్తోంది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు ద్వారపురెడ్డి జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తీరు దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ఆర్థికలోటును గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పలు రంగాల్లో వృద్ధి సాధించామన్నారు. జిల్లాలో 400 కిలోమీటర్ల మేర ఉపాధిహామీ పథకం నిధులతో సిమెంట్ రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.గోవిందరావు, స్థానిక ఎంపిపి ఉషా సరస్వతి, వైస్ ఎంపిపి ధనుంజయరావు, జెడ్పిటిసి ఎ.జగదీశ్వరి, తహశీల్దార్ కోరాడ సూర్యనారాయణ, ఎంపిడిఒ కె.సూర్యారావు, మాజీ ఎంపిపి పురుషోత్తమనాయుడు, స్థానిక సర్పంచ్ సులోచనారాణి తదితరులు పాల్గొన్నారు.
విమానాశ్రయం భూముల సర్వేను అడ్డుకున్న గ్రామస్థులు
విజయనగరం(టౌన్), జూన్ 6: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం భూములను సర్వే చేసేందుకు సోమవారం అధికారులు చేసిన ప్రయత్నాలకు మరోమారు విఘాతం కలిగింది. నిర్వాసిత గ్రామం రెడ్డి కంచేరులో సర్వే విభాగం అధికారులు విమానాశ్రయం కోసం భూములను సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులతో అక్కడికి చేరుకున్నారు. అధికారుల ప్రయత్నాలకు గ్రామస్థులు అడ్డుతగిలారు. రైతులు అంగీకరించిన భూము ల్లో కాకుండా రైతులు భూముల్లో అధికారులు ఎందుకు సర్వే చేస్తున్నారని నిలదీసారు. సర్వే అధికారులు విమానాశ్రయానికి భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతుల భూములలో కాకుండా భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల భూములలో సర్వే చేయడాన్ని గ్రామసర్పంచ్ కుమారుడు గురునాథ్ తదితర రైతులు ప్రశ్నించారు. సర్వే నిలిపివేయాలని నినాదాలు చేసారు. ఇంతలో అక్కడికి చేరుకున్న మహిళలు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై ధీనబంధు సిబ్బందితో అక్కడికి చేరుకుని సర్వేను అడ్డుకోవద్దని ప్రజలకు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడాలని తెలిపారు. అధికారులతో మాట్లాడేంతవరకు సర్వే నిలిపివేయాలని గ్రామస్తులు చెప్పడంతో ఎట్టకేలకు రెవెన్యూ, సర్వే అధికారులు చేపట్టిన సర్వేను నిలిపివేసి వెనుదిరిగారు.
ఆర్థిక అసమానతలు తొలగించండి
విజయనగరం(టౌన్), జూన్ 6: ఆర్థిక అసమానతలను తొలగించేందుకు అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎనిమిదవ తేదీన మహాసంకల్ప నవ నిర్మాణ దీక్షలో భాగంగా రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమాజంలోని ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు నెలకు పదివేలు ఆదాయం లభించేలా లక్ష్యాలు నిర్ధేశించుకోవాలని తెలిపారు. ఆర్థిక సూచికి బలోపేతం చేసేలా, ఆరోగ్య, సామాజిక, విద్యారంగ సూచీ లు అభివృద్దికావాలని చెప్పారు. అక్షరాస్యత, కంప్యూర్ల పరిజ్ఞానంలో ముం దుండాలని తెలిపారు. సెప్టెంబర్‌లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలు పరిగణనలోకి తీసుకుని నీరు-చెట్టు కార్యక్రమాలు ఆ నీటిని సంరక్షించేలా పూర్తిచేయాలని చెప్పారు. సిసి రోడ్లు నిర్మాణం వచ్చే జూన్ నాటికి పది లక్షల పంటకుంటల నిర్మాణం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఈఅంశాలపై మహాసంకల్పదీక్షలో ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో పార్వతీపురం నుండి రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి మృణాళిని, ఎమ్మెల్యే చిరంజీవులు విజయనగరం నుండి కలెక్టర్ ఎం ఎం నాయక్, జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, డి ఆర్‌ఓ జితేంద్ర, సిపి ఓ విజయలక్ష్మి, జడ్పి సి ఇ ఓరాజకుమారి అధికారులు పాల్గొన్నారు.
సామాజిక సమస్యలపై వెల్లువెత్తిన వినతులు
విజయనగరం(టౌన్), జూన్ 6: మీకోసం గ్రీవెన్స్ విభాగానికి సోమవారం పలు సామాజిక సమస్యలపై వినతులు అందాయి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి కలెక్టర్ ఎం ఎం నాయక్, జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ వినతులు స్వీకరించారు. మెంటాడ మండలం కుంటినవలస గ్రామంలో ఈ నెల రెండున హత్యకు గురైన కల్లుగీత కార్మికుడు చుక్కపోతయ్య కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి, కుటుంబాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్చు సత్యం వినతిపత్రం అందజేసారు. కల్లుగీత కార్మికులకు రక్షణ కల్పించాలని కోరారు. బొండపల్లి మండలం గొల్లుపాలెం గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కోళ్ల ఫారం కారణంగా గ్రామంలో పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయని, కోళ్లు కారణంగా ఈగలు విపరీతంగా వ్యాపించి సమీపంలోని ఎస్సీకాలనీ వాసులను అనారోగ్యానికి గురిచేస్తున్నాయని గ్రామానికి చెందిన కె. సన్యాసిరావు, సోములమ్మ ఫిర్యాదు చేసారు. కోళ్లఫారాన్ని తొలగించాలని కోరారు. వేపాడ మండలం పాటూరు గ్రామంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఎస్సీలకు 30 ఏళ్ల కిందట పట్టాలు ఇచ్చిన భూములను అనుభవిస్తున్నామని పాకలు వేసుకుని నివసిస్తున్నామని అయితే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇబ్బందులు పెడుతున్నారని ఎస్సీలు పాపమ్మ తదితరులు ఫిర్యాదు చేసారు. షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఒకటి నుండి ఐదవ తరగతి వరకు బెస్ట్ ఎవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు తీసుకునే గడువును మరో పదిరోజులు పొడిగించాలని దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు గండ్రేటి సత్యనారాయణ కలెక్టర్‌ను కోరారు. ఆదాయం, కుల ఇతర దరఖాస్తులు పొందేందుకు సమస్యలు ఎదురవుతున్న కారణంగా గడువులు పెంచాలని కోరారు. తోటపల్లి బ్యారేజి నిర్మాణంలో భూసేకరణ యూనిట్-2లో గరివిడి మండలం తోండ్రంగి గ్రామానికి చెందిన జమ్ము అప్పలనాయుడు అనే రైతుకు తొమ్మిది సెంట్లు భూమి కాలువ నిర్మాణానికి తీసుకున్నారని అయితే అదే పేరుమీద గ్రామంలోని మరొక వ్యక్తి ఖాతాలో జమ అయిందని, ఆసొమ్ము నిర్వాసితుడు అయిన తనకు ఇప్పించాలని కోరుతూ జమ్ము అప్పలనాయుడు గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందజేసాడు. బొండపల్లి మండలం కనిమెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ విధులకు హాజరు కాకుండా ఫిబ్రవరి, మార్చి నెలల్లో పనిచేసిన కూలీలకు మస్తరు రోల్స్ పోయిన కారణంగా చెల్లింపులు లేక కూలీలు డిమాండ్ చేస్తుంటే ఈ నెలలో పనిచేయకుండానే మస్తర్ రోల్స్ వేసి కూలీలకు ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి చెల్లింపులు చేయడానికి ఫీల్డ్ అసిస్టెంటు ప్రయత్నిస్తున్నారని, ఈ అక్రమాల మీద మండల అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన జైభీమ్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బగ్గ ఎర్రయ్య ఫిర్యాదు చేసాడు. విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలుచేసి ప్రైవేటు విద్యాసంస్థల్లో అధికంగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, గుర్తింపులేని విద్యా సంస్థలను రద్దు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థలలో పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరుతూ ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు వినతిపత్రం అందజేసారు. ఈ గ్రీవెన్స్‌లో అదనపు జెసి యుసిజి నాగేశ్వరరావు, డి ఆర్ ఓ జితేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీలో పార్శిల్ రవాణాకు అధిక ప్రాధాన్యత
విజయనగరం (్ఫర్టు), జూన్ 6: ఆర్టీసీలో పార్శిల్ రవాణాకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించిందని ఆర్టీసీ మార్కెటింగ్, కమర్షియల్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ కె.శ్రీనివాసరావుఅన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పార్శిల్ రవాణా కార్యాలయాన్ని సోమవారం నెక్ రీజియన్ విజయనగరం డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుమాట్లాడుతూ పార్శిల్స్, కవర్లు తదితర సరుకులను అత్యంత పదిలంగా సురక్షితంగా రవాణా చేస్తామని తెలిపారు. కవర్లకు 50 గ్రాముల వరకు 30 రూపాయలు, 200 గ్రాములకు 35 రూపాయల చొప్పున రుసుం వసూలు చేస్తామని చెప్పారు. 50కిలోల పార్శిల్‌ను 100 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు, 200కిలో మీటర్ల వరకు 100 రూపాయలు, 300 కిలోమీటర్ల వరకు 120 రూపాయలు, 400 కిలో మీటర్లకు పైబడి రవాణా చేసేవాటికి 150 రూపాయల చొప్పున పార్శిల్ ఛార్జీలను వసూలు చేస్తామని తెలిపారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, విశాఖపట్టణం, విజయనగరం, బొబ్బిలి, పాతపట్నం వరకు, పాలకొండ నుంచి విజయవాడ, విశాఖపట్టణం వరకు, పలాస నుంచి విజయవాడ, విశాఖపట్టణం, ఇచ్ఛాపురం వరకు, టెక్కలి నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం వరకు పార్శిల్ రవాణా చేస్తామని తెలిపారు. అదేవిధంగా విజయనగరం నుంచి హైదరాబాద్, విజయవాడ, గుణుపూర్, జైపూర్, భీమవరం, శ్రీకాకుళం, అనకాపల్లి వరకు, సాలూరు నుంచి విశాఖపట్టణం, విజయవాడ, విజయనగరం వరకు, పార్వతీపురం నుంచి విజయవాడ, అమలాపురం, విజయనగరం వరకు, ఎస్.కోట నుంచి విజయనగరం, విశాఖపట్టణం, కించుమండ వరకు పార్శిల్ సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి ముత్తిరెడ్డి సన్యాసిరావు, కమర్షియల్ మేనేజర్ ఆర్.రమేష్, డిపోమేనేజర్ కె.పద్మావతి, ఆర్టీసీ విజిలెన్స్ బస్‌స్టేషన్ ఇన్‌ఛార్జి పి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.