విజయనగరం

అంగన్‌వాడీ భవనాలు త్వరితగతిన పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 6: జిల్లాలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవనాలు త్వరితగతిన పూర్తిచేసి పిల్లలను ఆయా కేంద్రాలలోకి మార్చాలని కలెక్టర్ ఎంఎం నాయక్ ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 596 అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేసామని వీటిని సకాలంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం సహకారంతో నిర్మితమవుతున్న ఈ భవనాల పనులు తీరుపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అదనపు వసతులను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాలు అక్కడికి తరలించాలని సూచించారు. భవనాలకు స్థలంలేని ప్రాంతాలలో రెవెన్యూ అధికారులతో చర్చించి భూ సేకరణకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.
మహాసంకల్పానికి సిద్ధం కండి
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్ష లో భాగంగా ఎనిమిదవ తేదీన నియోజకవర్గ జిల్లా స్థాయిలో మహాసంకల్ప దీక్షకు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు. మహాసంకల్ప కార్యక్రమానికి మండల అధికారులు ఈ ఏడాదిలో పూర్తిచేసే అంశాలతో లక్ష్యాలను నిర్ధేశించుకుని సిద్ధం కావాలని తెలిపారు. ఈ ప్రణాళికను మహా సంకల్ప వేదిక నుండి ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్, ఎజెసి నాగేశ్వరరావు,. డి ఆర్ ఓ జితేంద్ర ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి
గజపతినగరం, జూన్ 6: నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటుచేయడానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్లో నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా ఆరవ రోజు పరిశ్రమల ప్రోత్సాహం అన్న అంశంపై అభివృద్ధి నివేదికను వివరించారు. నియోజకవర్గంలోని దత్తిరాజేరును అగ్రీజోన్‌గా గుర్తించి పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యం గా 400కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంలో ఉందని, దీనివలన విద్యుత్ కొరత పరిశ్రమలకు ఉండదని అన్నారు. యువత కూడా ఖాళీగా ఉండి తల్లిదండ్రులపైన ఆధారపడకుండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వృత్తి విద్యా శిక్షణలు ఉపయోగించుకుని స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని అన్నారు. బొండపల్లి మండలంలో పచ్చళ్లు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మహిళలు శిక్షణ పొందితే వారు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కమ్యూనిటీ హాళ్లను కట్టించే ఏర్పాటు చేస్తామని అన్నారు. పరిశ్రమలు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలపై నెలకొల్పడం కోసం ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళతామని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సా హం అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డి ఆర్ డి ఎ పిడి ఢిల్లీరావు, డిసిఓ వెంకటరావు, ఎంపిపిలు గంట్యాడ శ్రీదేవి, బి.రాజేశ్వరి, బొండపల్లి జడ్పీటిసి బండారు బాలాజీ, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావి శ్రీధర్, గజపతినగరం మార్కెట్ కమిటీ చైర్మన్ చంటిరాజు, తహశీల్దార్లు ప్రసాద్‌పాత్రో, నీలకంఠరావు, ఎంపిడి ఓలు అరుంధతి దేవి, కోరాడ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కొత్తవలస, జూన్ 6: పర్యావరణనాన్ని రక్షించే బాధ్యత అందరిపై ఉందని కొత్తవలస మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి అనే్న రోజా క్రిష్టియానా తెలిపారు. సోమవారం కోర్టు ఆవరణలో జరిగిన పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె పర్యావరణ పరిరక్షణకు పలు సూచనలు చేసారు. ప్రతి ఒక్కరు పుట్టినరోజున పెళ్లిరోజు వివిధ శుభకార్యాల రోజున తప్పనిసరిగా ఎకడో ఒక దగ్గర ఒక మొక్కను నాటాలని చెప్పా రు. జీవితంలో ప్రతి మనిషి కనీసం 20 నుండి 50 మొక్కలు పెంచి పోషించిననాడు ప్రపంచమంతా పచ్చదనంతో నిండిపోతుందని తెలిపారు. భూతాపాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా వృక్షాలను పెంచాల్సిందేనని ఆమె అన్నారు. పర్యావరణ రక్షణకు మొక్కలు తప్ప మరేమార్గం లేదని చెప్పారు. సృష్ట్ధిర్మాన్ని కాపాడాలని, పంచభూతాలను రక్షించుకోవాలని హితవుపలికారు. పర్యావరణవ అదుపు తప్పితే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని, తద్వారా సృష్టి నాశనం అవుతుందని హెచ్చరించారు. రియల్ వ్యాపారాలలో కొంతమేర చెట్లు నరికివేసి పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్.శ్రీరామ్మూర్తి నాయవాదులు శ్రీను, మహేంద్ర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.