విజయనగరం

ప్రయాణికులకు అందుబాటులో ఆర్టీసీ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 6: ప్రయాణికులకు అందుబాటులోకి ఆర్టీసీ సేవలను విస్తృతం చేస్తున్నామని ఆర్టీసీ విజయనగరం రీజియన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయనగరం నుంచి భద్రాచలం వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రవేశపెట్టామని, అలాగే విజయవాడ వెళ్లేందుకు అదనంగా మరో బస్సును నడుపుతున్నామని అన్నారు. ముఖ్యంగా ఎస్.కోట డిపో నుంచి రెండు ఇంటర్‌స్టేట్ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ బస్సులు విశాఖపట్టణం నుంచి విజయనగరం మీదుగా జయపూర్, విశాఖపట్టణం నుంచి విజయనగరం మీదు రాయగడ వరకు నడుపుతామని చెప్పారు. అదేవిధంగా ఎస్.కోట నుంచి విశాఖపట్టణానికి టుస్టాప్ బస్సులను నడుపుతామని, ఇవి కొత్తవలస, ఎన్‌ఎడి కొత్తరోడ్డు జంక్షన్‌ల వద్ద మాత్రమే ఆగుతాయని అన్నారు. ఎస్.కోట నుంచి విశాఖపట్టణానికి ప్రతి అర గంటకు ఒక బస్సును నడుపుతామని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్, కమర్షియల్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ కె.శ్రీనివాసరావు, ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి ముత్తిరెడ్డి సన్యాసిరావు, కమర్షియల్ మేనేజర్ ఆర్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.