విజయనగరం

నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేటు వాహనాలపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 7: మోటారు వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేటు వాహనాలపై దాడులు నిర్వహిస్తున్నామని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్ తెలిపారు. అదేవిధంగా పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లే వాహనాలపై కూడా దాడులు చేస్తున్నామని చెప్పారు. దీనికి మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ బృందం ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలు, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లే వాహనాలపై దాడులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ విజయనగరం నుంచి చీపురుపల్లి, రాజాం, గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం రూట్లతోపాటు విజయనగరం నుంచి జామి, ధర్మవరం ఎస్.కోట వెళ్లే రూట్, విజయనగరం నుంచి అలమండ మీదుగా కొత్తవలస వెళ్లే రూట్లలో దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లే ఆటోలు, జీపులు, మ్యాక్సిక్యాబ్‌లు తదితర ప్రైవేటు వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాలలో ప్రయాణించి ప్రమాదాల బారిన పడి చాలామంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల సురక్షిత ప్రయాణాన్ని అందించే ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని ఆయన ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి ముత్తిరెడ్డి సన్యాసిరావు పాల్గొన్నారు.