విజయనగరం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరివిడి, జూన్ 7 : పేదల సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. మంగళవారం చీపురుపల్లి మండల కార్యాలయం ఆవరణలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విభజన వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి అధ్వాన్నంగా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా చేపడుతున్నారని చెప్పారు. వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛన్, బిసిలకు ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ అమలు చేయడం, అగ్ర వర్ణాల పేదల సంక్షేమం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఆసరాగా నిలుస్తాయని చెప్పారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాలను విస్తృతంగా అభివృద్ధిచేసి పేదల ముంగిటికే ఖరీదైన వైద్య సేవలను అందిస్తున్న ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. మహిళాభ్యున్నతికి పాటుపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణపతిరావు,నోడల్ అధికారి ఆర్డీ ఓ శ్రీనివాసమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి శారద, చీపురుపల్లి, గరివిడి ఎంపిపిలు పాల్గొన్నారు.