విజయనగరం

నగర పంచాయతీని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, జూన్ 7: నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేసి జరజాపుపేట, నెల్లిమర్ల గ్రామాలను పంచాయతీలుగా మార్పు చేయాలని జడ్పీటిసి గదల సన్యాసినాయుడు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీ సాధనకోసం జరజాపుపేట గ్రామంలో నిర్వహిస్తున్న రిలే నిరహారదీక్షా శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరజాపుపేట గ్రామస్థులు న్యాయమైన సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. రిలేదీక్షలు చేపట్టి 20 రోజులపైబడినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దారుణమన్నారు. నగర పంచాయితీ రద్దుకోసం చేసిన పోరాటానికి వైసిపి నుంచి మద్దతు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కిల్లంపల్లి రామారావు, ఎం ఎం నాయుడు, మద్దిల సరస్వతి పాల్గొన్నారు.