విజయనగరం

లారీ దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 9: పట్టణ పరిధిలో లారీ చోరీ కేసును సిసి ఎస్, పట్టణ వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. గురువారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సిసి ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ నెల నాలగవతేదీ రాత్రి కణపాకలోని ఎస్‌బి ఐ ముందు పార్కు చేసిన ఎపి-16టిడి1789నెంబరు గల లారీని చోరీకి గురైనట్లు సిసి ఎస్ పోలీసులకు సమాచారం అందిందని డి ఎస్పీ చక్రవర్తి తెలిపారు. వన్‌టౌన్ సి ఐ వెంకట అప్పారావు, సిబ్బందితో ఆరు బృందాలను ఈకేసును దర్యాప్తు చేసేందుకు నియమించామని తెలిపారు. రాయగడ, జైపూర్ తదితర ప్రాంతాలలో దర్యాప్తు నిర్వహించిన సిబ్బంది సాలూరులో నిందితులు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. గండ్రేటి సత్యనారాయణ, ఒల్లూరి రాంబాబు ఇద్దరు లారీని దొంగిలించి సాలూరుకు తరలించారని ఈ లారీ విలువ పదిలక్షలుగా తెలిపారు. లారీలను దొంగిలించిన కేసులో సత్యనారాయణ గతంలో నిందితుడని అన్నారు. లారీ యజమానులు లారీలను పార్క్‌చేసి తాళాలు కేబిన్‌లో వదిలివేయకుండా డ్రైవర్లకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. జిపి ఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జిల్లాలో దాదాపు నాలుగు కేసులు ఇటువంటివి నమోదయ్యాయని వెల్లడించారు. నిందితులను అరెస్టుచేసి లారీని స్వాధీనం చేసుకున్నామని ఈ కేసును చేధించడంలో సిసి ఎస్ ఎస్సై జియ్యా ఉద్దీన్, సిబ్బంది సత్యనారాయణ, మురళీ, రమణ ప్రత్యేక ప్రతిభ కనబరిచారు.