విజయనగరం

నిద్ర పోతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 9: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధిలో యంత్రాంగం పనితీరుపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సభ్యులతో ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధితో పాటు సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్న మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీలు నివసించే గ్రామాల్లో ఖర్చుచేయకుండా అలసత్వం వహిస్తున్నారని ఆసంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ అంటే జిల్లా యంత్రాంగానికి చిన్నచూపా అని ప్రశ్నించారు. కనీసం ప్రోటోకాల్ పాటించి అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడం శోచనీయమని అన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల పట్ల అధికారుల తీరు సమంజసంగా లేదని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రతి నెలా జీతాలు తీసుకుంటూ నిద్రపోతున్నారా అంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రతి నెల గ్రామాల్లో సివిల్ రైట్స్ సమావేశాలు నిర్వహించాల్సిన పోలీసు యంత్రాంగం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని అన్నారు. జిల్లా మెజిస్ట్రేట్‌గా ప్రతి మూడు నెలలకు అసిస్టెంటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పి ఓ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ సమావేశాలు ఎందుకు నిర్వహించటంలేదో సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. అట్రాసిటీ చట్టం పరిధిలోని కేసుల్లో కుల ధృవీకరణ పత్రం ఇవ్వడానికి తహశీల్దార్లు స్పందించంటలేదని పోలీసు అధికారులు కమిషన్ దృష్టికి తెచ్చారు. గతంలో మంజూరు చేసిన కులధృవీకరణ పత్రం పరిగణనలోకి తీసుకుని అట్రాసిటీ కేసుల్లో నిందితులపై చార్జ్‌షీట్ సకాలంలో ఫైల్‌చేసి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో కౌంటర్ కేసులు దాఖలకు పోలీసు అధికారులు ప్రోత్సహించవద్దని స్పష్టంచేసారు. జిల్లాలో శాఖ లవారీగా రూల్ ఆఫ్ రిజర్వేషన్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టుల్లో రిజర్వేషన్ల అమలు, ఖాళీ పోస్టులు భర్తీపై ఆయన సమీక్షించారు. ఈనెలాఖరులోగా ఎస్సీ ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని స్పష్టంచేసారు. అటవీశాఖ ద్వారా ఫలసాయాన్ని ఇచ్చే మొక్కలు ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులతో వారిచేత కూలిపనులు చేయించడం మంచిదికాదని అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అట్రాసిటీ కేసుల్లో గాయాలు పాలయిన ఎస్సీ, ఎస్టీలను అవుట్ పేషెంట్లుగా చూడరాదని జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజుకు ఆదేశించారు. పరిశ్రమలు, మైనింగ్ గనులను నిర్వహించేందుకు ముందుకు వచ్చే ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని సూచించారు. డ్వాక్రా సంఘాలలో కొత్త గ్రూపులు ఏర్పాటుచేసి ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇచ్చి అభివృద్ధిలోకి తేవాలని అన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో జి ఓ నెం. 44 కింద 25శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీలకు అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులు నిర్లిప్తతను ఆయన తీవ్రంగా పరిగణించారు. ఓడి ఎఫ్ గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి చర్యలు చేపట్టామని వెంటనే బిల్లులు చెల్లిస్తున్నామని కలెక్టర్ ఎం ఎం నాయక్ వివరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సూచించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి, ఎస్పీ లేళ్ల కాళిదాసు, పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, ఏజెసి నాగేశ్వరరావు, సభ్యులు,అధికారులు పాల్గొన్నారు. కాగా ఈసమావేశానికి సకాలంలో హాజరుకాని అధికారులు, గైర్హాజరైన అధికారుల తీరుపై కమిషన్ చైర్మన్ అసంతృప్తి వ్యక్తంచేస్తూ నోటీసులు జారీచేయాలని అదేశించారు.