విజయనగరం

ఊపందుకున్న వ్యవసాయ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, జూన్ 10: మండలంలో ఈ నెలలో ఇప్పటి వరకు అడపాదడపా కురిసిన వర్షాలతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అల్పపీడన ద్రోణుల పుణ్యమా అని మోస్తరు వర్షాలు కురిసాయి. ఈ నెలలో 1,3,6,7 తేదీలలో వర్షాలు బాగానే కురిసాయి. దీంతో రైతులు పొలాల దుక్కులుచేస్తున్నారు. మెట్ట భూముల్లో దుక్కులు పూర్తిచేసిన రైతులు నువ్వుపంటను వేస్తున్నారు. వర్షాధారం పై వరి పండిస్తున్న గ్రామాలలో పొలం దుక్కులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాటిపూడి జలాశయం నీటి ఆధారంగా వరి పండిస్తున్న ఆయకట్టు గ్రామాలలో వరి నారు మడులు వేయడానికి దుక్కులుచేస్తున్నారు. వర్షాధారంపై వరి పండిస్తున్న లక్కిడాం, నరవ, రామవరం తదితర గ్రామాలలో పొలం దుక్కులు పూర్తిచేసి ఎద పద్దతిలో వరిని పండించేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలో వరిసాగు విస్తీర్ణం సుమారు 15వేల ఎకరాలు. దీనిలో తాటిపూడి జలాశయం నీటి ఆధారంగా కొంత భాగం, వర్షాధారంపై మరికొంత భాగంలో వరిని పండిస్తున్న విషయం తెలిసిందే. తాటిపూడి జలాశయం నీటిని ఆయకట్టు భూములకు ఖరీఫ్ అవసరాలకు విడిచిపెట్టే తేదీ ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం రిజర్వాయర్ 282.5 అడుగులు నీరు ఉంది. వర్షాలు విరివిగా కురిస్తే వర్షాధార ప్రాంతాలలో ఖరీఫ్ వ్యవసాయ పనులు జోరు అందుకుంటాయి.