విజయనగరం

వాడివేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 10: పట్టణంలో వీధిదీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పింఛన్ల పంపిణీ, ఆక్రమణల తొలగింపులో అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరిపై పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు విరుచుకుపడ్డారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రసాదుల కనకమహాలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం వాడివేడిగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో అధికారుల వైఖరిపై మండిపడ్డారు. పట్టణంలో వీధిదీపాలు వెలగడం లేదని మున్సిపల్ కౌన్సిలర్లు రొంగలి రామారావు, కెల్ల వరలక్ష్మి, గార సత్యనారాయణ, మైలపిల్లి పైడిరాజు, గాడు అప్పారావు అన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. పట్టణంలో కాంట్రాక్టర్లు సక్రమంగా పనిచేయడం లేదని, కాంట్రాక్టర్లు సహకరించపోవడం వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదని మున్సిపల్ కౌన్సిలర్ కంది మురళీనాయుడు అన్నారు. కంటోనె్మంట్ మున్సిపల్ హైస్కూల్ ప్రధాన గేటు ఏర్పాటు చేయకపోవడం వల్ల అసాంఘిక కార్యకపాలాలు జరుగుతున్న కొర్నాన రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో పాస్టిక్ వినియోగం పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సుంకరి విజయలక్ష్మి అన్నారు. మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయని, మున్సిపల్ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడులు చేయడం సిగ్గు చేటు అని మున్సిపల్ కౌన్సిలర్ రొంగలి రామారావుతెలిపారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటే ఇలా జరిగి ఉండేదని కాదని చెప్పారు. విటి అగ్రహారంలో అనుమతి లేని భవన నిర్మాణాలు జరుగుతుంటే..టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. అదేవిధంగా పట్టణంలో పింఛన్లు పంపిణీలో అనేక లోపాలు ఉన్నాయని, వీటిని సరిచేయవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కనకమహాలక్ష్మితోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ షకీలా, ఉండ్రాళ్ల వెంకటలక్ష్మి, చెన్నా రూపవాణి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ అజెండాలో పొందుపర్చిన అనేక అంశాలపై చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ ఎంఎం నాయుడు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు ప్రసాద్, మత్స్యరాజు, మున్సిపల్ రెవెన్యూ అధికారి డేవిడ్ పాల్గొన్నారు.