విజయనగరం

కార్పొరేట్ స్కూళ్లల్లో సీట్లు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 10: జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలు, బెస్ట్ పాఠశాలల్లో సీట్ల కేటాయింపు కార్యక్రమాన్ని శుక్రవారం అదనపుజాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు నిర్వహించారు. కలెక్టరేట్ సమీపంలోని అంబేద్కర్ కల్యాణ మండపంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విశే్వశ్వరరెడ్డి, కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పి. రత్నం, సిబ్బంది పర్యవేక్షణలో హాజరైన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ఒకటవ తరగతి, ఐదవ తరగతి ప్రవేశాలకు సీట్లు కేటాయించారు. ఒకటవ తరగతిలో వంద సీట్లకు 182 దరఖాస్తులు అందాయి. పది కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులకు సీట్లు కేటాయించడంలో లాటరీ ద్వారా ఎంపిక నిర్వహించారు. ఐదవ తరగతి రెసిడెన్షియల్ పాఠశాలలో సీట్లు 200 కాగా ఐదు స్కూల్స్‌లో 223దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించిన అధికారులు తల్లిదండ్రుల సమక్షంలో సీట్లు కేటాయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ పాఠశాలల ఎంపిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఏజెసి నాగేశ్వరరావు కోరారు.