విజయనగరం

14న పేద బ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహాకాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 10: విజయనగరం పట్టణ పరిధిలోని పేద బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించేందుకు దరఖాస్తులు పరిశీలన పూర్తిచేసామని సమాఖ్య కార్యదర్శి చక్రవర్తి తెలిపారు. పట్టణంలోని రాజీవ్ నగర్‌లోగల బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య కార్యాలయంలో సమాఖ్య గౌరవాధ్యక్షులు డి.వి.శ్రీకాంత్, అధ్యక్షులు శివరామయ్య, సభ్యులురామంల పర్యవేక్షణలో ప్రోత్సాహకాలకు అందిన దరఖాస్తులను పరిశీలించామని కార్యదర్శి చక్రవర్తి శుక్రవారం వెల్లడించారు. సుమారు 400 దరఖాస్తులు అందాయని పదవ తరగతి, ఇంటర్, బీటెక్, పిజి తదితర విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన సహకారం గత 30 ఏళ్లుగా సమాఖ్య నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే 14వ తేదీ మంగళవారం సాయంత్రం ఆనందగజపతి ఆడిటోరియంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐ.వై. ఆర్. కృష్ణారావు పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేస్తారని తెలిపారు.