విజయనగరం

గుత్తేదారులదే గుత్యాధిపత్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 10: విజయనగరం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సంబంధించి గుత్తేదారులే గుత్త్ధాపత్యం వహిస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరి వల్ల పట్టణంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో టెండర్లు ఖరారు చేసిన పనులు కూడా పూర్తి చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. కొన్ని చోట్ల పనులు ప్రారంభించక పోగా, మరికొన్ని చోట్ల ప్రారంభించిన పనులను పూర్తి చేయడం లేదు. చాలాచోట్ల సగంలోనే పనులు నిలిచిపోయాయి. ఫలితంగా సరైన రోడ్లు, కాలువలు, కల్వర్టుల సదుపాయం లేక పట్టణ ప్రజలు నరకయాతన పడుతున్నారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే మీసాల గీత ఆదేశిస్తున్నా, ఎవరూ పట్టించుకోవడంలేదు. మూడునెలలోగా అభివృద్ధి పనులను పూర్తి చేయకపోతే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని రెండు నెలల క్రితం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ చేసిన హెచ్చరికలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పట్టణంలో పలు గ్రాంట్లు ద్వారా 54.20 కోట్ల రూపాయలతో 773 అభివృద్ధి పనులు చేపట్టేందుకు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఇందులో 15.76 కోట్ల రూపాయల విలువైన 317 పనులు పూర్తి కాగా, 5.62 కోట్ల రూపాయల విలువైన 38 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇంకా 32.82 కోట్ల రూపాయల విలువైన 428 అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 18.19 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన 291 పనులను ఇంతవరకు ప్రారంభించలేదు. మరో 14.61 కోట్ల రూపాయల విలువైన 127 పనులు టెండర్ల ప్రక్రియను దాటలేదు. ఇవికాకుండా పట్టణంలో ఒక్కొక్క వార్డుకు 40 లక్షలు, మున్సిపాలిటీలో విలీనమైన వార్డులకు 60 లక్షల రూపాయల చొప్పున 40 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, కల్వర్టుల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఎనిమిది నెలల క్రితం ప్రకటించారు. అయితే ఇందులో 20 కోట్ల రూపాయలతో 74 అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేయగా, 12.71 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచారు. అయితే మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, పాలకవర్గసభ్యుల అశ్రద్ద, కాంట్రాక్టర్ల బాధ్యతారాహిత్యం వల్ల కోటి రూపాయలకు మించి పనులు జరగలేదు. గత రెండేళ్ల నుంచి పట్టణంలో అభివృద్ధి పనులు సక్రమంగా జరగకపోవడం వల్ల ప్రజలు నరకయాతన పడుతున్నారు. మున్సిపల్ పాలకవర్గం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడుస్తున్నా అభివృద్ధిలో ఆశించిన ప్రగతి సాధించకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అటు అధికారులలోగాని, ఇటు పాలకులలోగాని ఏమాత్రం చలనం కనిపించడం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 2,44,598 జనాభా ఉంది. 40 వార్డు పరిధిలో విస్తరించిన ఈ పట్టణంలో 75వేల వరకు నివాస, నివాసేతర గృహాలు ఉన్నాయి. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వౌలిక వసతులు కల్పించడంలేదు. ముఖ్యంగా 2015-2016 జనరల్ ఫండ్స్ ద్వారా 15.69 కోట్ల రూపాయలతో 208 పనులు చేయాలని ప్రతిపాదించగా, 1.26 కోట్ల రూపాయల విలువైన 19 పనులను పూర్తి చేయగా, రూ. 3.13 కోట్లతో చేపట్టిన 21 పనులు ప్రగతిలో ఉన్నాయి. 10.37 కోట్ల రూపాయలకు సంబంధించిన 143 పనులను ఇంతవరకు ప్రారంభించకపోగా, 92.75 లక్షల రూపాయల విలువైన 25 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2014-2015 ఆర్థిక సంవత్సరంలో 1.39 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన పనులలో 28 పనులకు ఇంకా మోక్షం లభించలేదు. జనరల్ ఫండ్స్ కింద 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 2.12 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన 18 పనులు కూడా ప్రారంభం కాలేదు. అలాగే బిఆర్‌జిఎఫ్ 2013-2014లో 2.34 కోట్లతో ప్రతిపాదించిన 50 పనులలో 33 పనులు ఇంతవరకు జరగలేదు. 13వ ఆర్థిక సంఘం ద్వారా 2013-2014లో 3.60 కోట్లతో 16 పనులు, 2014-2015లో 4.14 కోట్లతో ప్రతిపాదించిన 15 పనులలో ఏ ఒక్కటీ ప్రారంభం కాలేదు. దీనికితోడు అమృత పథకం కింద కేంద్రం ప్రభుత్వం ఇటీవల 5.50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శిక సూత్రాలను జారీ చేసినా, ఇంతవరకు పథకానికి సంబంధించిన ప్రగతి కనిపించలేదు. ఈ నేపధ్యంలో మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి, నిధుల వినియోగం, అధికారులు, పాలకవర్గసభ్యుల నిర్లక్ష్యంపై ‘తీరు మారదు...పాలన సాగదు’ అనే శీర్షికతో శుక్రవారం ఆంధ్రభూమిలో వచ్చిన వార్తపై ఎమ్మెల్యే మీసాల గీత స్పందించారు. పట్టణంలో అభివృద్ధి పనులపై మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.